అర్ధరాత్రి వైసిపిలో కీలక మార్పు…

    0
    563

    వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో సైలెంట్ గా , ఒక పెద్ద కుదుపు . అంతర్గతంగా ఏమి జరిగిందో ఏమో కానీ, రాత్రికిరాత్రే కీలకమైన మార్పులు జరిగిపోయాయి. ఇందులో ఎవరికి లాభం ,ఎవరికి నష్టమో తెలియదు గానీ ఒక కీలకమైన మార్పు మాత్రం , రాత్రి నిశ్శబ్దంగా జరిగిపోయింది . ఇప్పటివరకు ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్తగా, విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే రాజ్యసభ సభ్యుడు , ముఖ్యమంత్రి జగన్ కు ఆత్మ బంధువు విజయసాయిరెడ్డిని ఆ బాధ్యతల నుండి తప్పించారు . ఆయన ఇప్పటివరకు చూస్తున్న ఆ బాధ్యతలను టిటిడి బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి కి అప్పగించారు . విజయసాయి రెడ్డికి కొత్తగా పార్టీ జిల్లా అధ్యక్షులు , కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీ సమన్వయకర్తల , సమన్వయ బాధ్యతలు అప్పగించారు.

    విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్ర రాజకీయాలను, విశాఖను రాజధానిగా చేయాలన్న లక్ష్యంతో విశాఖలో పనులను పర్యవేక్షిస్తూ వచ్చిన విజయసాయి రెడ్డి ,ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా అధ్యక్షులు, పార్టీ రీజినల్ సమన్వయకర్తల ఇన్ ఛార్జ్ అయ్యారు. విశాఖ బాధ్యతలను వై వి సుబ్బారెడ్డికి అప్పగించారు . విశాఖలో బాధ్యతలకు , విజయసాయి రెడ్డి అక్కడే ఇల్లుకూడా తీసుకొని , కాపురం పెట్టారు. ఇప్పుడు ఇలా ఎందుకు చేశారు అన్నది రాజకోట రహస్యం ..

    ఎందుకంటే విజయసాయి రెడ్డి ఢిల్లీలో వైసిపి రాజకీయాలను వైసీపీ రాజకీయ మంత్రాంగం నడిపే కీలకమైన నాయకుడు. ఈ బాధ్యతల్లో ఎటువంటి మార్పు చేయలేదు. పార్టీ ఎమ్మెల్యేలు మీడియా ఈ బాధ్యతలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చూస్తారు ఇదివరకు కూడా ఆయన ఇదే బాధ్యతలను చూసేవారు ఢిల్లీలో కేంద్ర మంత్రులు ప్రధాన మంత్రితో సహా కేంద్ర మంత్రులు ఇతర ఉన్నత స్థాయి వ్యక్తులను సమన్వయం చేసుకొని ఢిల్లీ రాజకీయాన్ని నడిపే బాధ్యత ఇప్పటికీ ఆయన ఆ బాధ్యత లోనే కొనసాగుతారు. కాకపోతే విశాఖపట్నం బాధ్యతలను వై వి సుబ్బారెడ్డికి అప్పగించడమే ఇక్కడ విశేషం.

    ఇవీ చదవండి… 

    బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

    మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

    ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

    ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.