భారత్ లో మారణహోమం సృష్టిస్తున్న కరోనా B.1.617 రకం వేరియంట్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇప్పుడిది ప్రపంచంలో 44 దేశాల్లో విస్తరించిందని పేర్కొంది. భారత్ లో మాత్రం ఈ వైరస్ మారణహోమం సృష్టించడానికి ఆ దేశంలో అనేక కారణాలున్నాయని తెలిపింది. బ్రిటన్ , బ్రెజిల్ , సౌత్ ఆఫ్రికా దేశాలలో ప్రబలిన మూడు రకాల కరోనా కలిసి B.1.617 రకం వేరియంట్ కరొనగా మారిందని అన్నారు. అన్ని రకాల వైరస్ లకన్నా ఇది వేగంగా వ్యాప్తి చెందిందని అన్నారు. మారణహోమం సృష్టించడంలోనూ ఇది ప్రమాదకరంగా ఉందన్నారు. భారత్ తర్వాత ఎక్కువ కేసులు బ్రిటన్ లో కనిపించాయని WHO స్పష్టం చేసింది.
భారత్ లో మరణాలు ఎక్కువగా ఉండటానికి B.1.617 రకం కరోనా వైరస్ తో పాటు , ఆ వైరస్ సోకిన వారికి ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా కారణమని పేర్కొంది. భారత్ లో సకాలంలో వాక్సిన్ పథకం అమలులో వైఫల్యం , B.1.617 రకం కరొనపై గత అక్టోబర్ నుంచే హెచ్చరికలు ఉన్నా , పట్టించుకోక పోవడం , ఎన్నికల ర్యాలీలు , మతపరమైన కార్యక్రమాలలో కోట్ల మంది గుమికూడటం, వైరస్ ఉధృతమైన తరువాత కూడా జాతీయ స్థాయిలో ప్రణాళిక లేకపోవడం , ప్రమాదం ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేకపోవడం .. ఇవన్నీ భారత్ లో మరణాలు సంఖ్య పెరగడానికి , వైరస్ ప్రబలడానికి కారణాలని WHO శాస్త్రవేత్తలు ఇదివరకే ప్రకటించారు.
ఇవీ చదవండి
టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .
10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..
ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?
విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.