బ్లాక్ ఫంగ‌స్.వైట్ ఫంగ‌స్. ఏది ప్రాణాంత‌కం ?

  0
  33

  కరోనా వైరస్ కి తోడు బ్లాక్ ఫంగస్ భయాందోళనలు కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఇది చాల‌ద‌న్న‌ట్లు తాజాగా ‘వైట్ ఫంగస్’ కూడా జ‌త క‌లిసింది. ఈమ‌ధ్య‌ వైట్ ఫంగ‌స్ కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతుండ‌డం మ‌రింత వ‌ణుకు పుట్టిస్తోంది. ఇంత‌కీ బ్లాక్ ఫంగ‌స్.. వైట్ ఫంగ‌స్.. ఈ రెండింటిలో ఏది ప్రాణాంత‌కం అంటే, వైట్ ఫంగ‌స్ అనే చెప్పాలి. బ్లాక్ ఫంగ‌స్ కంటే వైట్ ఫంగ‌స్ అతి ప్ర‌మాద‌కారి.. ప్రాణాంత‌కం అని నిపుణులు చెబుతున్న మాట‌.

  వైట్ ఫంగ‌స్ శ‌రీరంలోకి ప్ర‌వేశించింద‌టే లోప‌లి భాగాల‌ను ప్ర‌భావితం చేస్తుంది. రోగ నిరోధక శక్తి త‌క్కువ ఉన్న వ్య‌క్తుల‌పై దీని ప్ర‌భావం అమితంగా క‌నిపిస్తుంది. ఒక్క‌సారి శ‌రీరంలోకి ప్ర‌వేశించిందంటే బ్రెయిన్, కిడ్నీలు, జ‌న‌నేంద్రియాలు, గోరు కింది భాగాలు, జీర్ణ‌వ్య‌వ‌స్థలను నాశ‌నం చేస్తుంది. షుగ‌ర్ పేషంట్లు, స్టెరాయిడ్స్ అధికంగా వాడే వాళ్ళు, ఇత‌ర వ్యాధుల‌తో బాధ‌ప‌డే రోగులు, అప‌రిశుభ్ర వాతావర‌ణంలో నివ‌సించేవారు, వైట్ ఫంగస్ బారిన ప‌డ‌తే కోలుకోవ‌డం చాలాక‌ష్టం. బ్లాక్ ఫంగ‌స్ కానీ, వైట్ ఫంగ‌స్ కానీ… సెకండ‌రీ ఇన్ఫెక్ష‌న్లుగా అభివృద్ది చెంది ప్రాణాంత‌కం అవుతున్నాయ‌ని ఎయిమ్స్ చైర్మ‌న్ గులేరియా స్ప‌ష్టం చేశారు.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు