స్పుత్నిక్-వి టీకా ధర తెలిస్తే షాక్..

  0
  455

  భారత్ లో కొవాక్సిన్, కొవిషీల్డ్ కి తోడుగా.. స్పుత్నిక్-వి త్వరలో మార్కెట్ లోకి రాబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే డీసీజీఐ అనుమతిచ్చిన నేపథ్యంలో స్పుత్నిక్-వి రేటెంత అనే విషయం చర్చకు వచ్చింది. అత్యవసరంగా కొన్ని డోసుల టీకాను రష్యా నుంచి దిగుమతి చేసుకుని దేశీయంగా పంపిణీ చేసేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీ‌ సన్నాహాలు చేస్తోంది. ఈ నెలాఖరు నాటికి స్పుత్నిక్-వి టీకా భారత్ లో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.
  సీరమ్ ఇన్ స్టిట్యూట్ తయారీ కొవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారీ కొవాక్సిన్ టీకాలను 2 డాలర్లు అంటే 150 రూపాయలు చెల్లించి భారత ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఇదే ధరకు ‘స్పుత్నిక్‌ వి’ టీకా కూడా ఇవ్వాలని రష్యా సంస్థ అయిన ఆర్‌డీఐఎఫ్‌ను, ఆ సంస్థకు దేశీయ వ్యాపార భాగస్వామిగా ఉన్న డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థను భారత ప్రభుత్వం కోరే అవకాశం ఉంది.
  స్పుత్నిక్-వి ఒక డోసు టీకా రేటు ఇతర దేశాల్లో 10 డాలర్లు అంటే దాదాపు 750 రూపాయలన్నమాట. అయితే ఇతర దేశాలన్నిటికీ 750 రూపాయలకు సరఫరా చేస్తున్న సంస్థ, భారత్ కు మాత్రం రాయితీపై ఇస్తుందని అనుకోలేం. అయితే ప్రైవేటుగా దీని రేటు పెంచుకుని అమ్ముకుంటూ, ప్రభుత్వానికి మాత్రం తక్కువరేటుకి ఇచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేం.

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.