నీళ్లకు రెమిడీస్ వీర్ లేబుల్ – రేటు 40 వేలు.

  0
  1181

  రెమిడిసివ‌ర్ ఇంజ‌క్ష‌న్ల‌లో డిజిట‌ల్ వాట‌ర్ పోసి వేల‌కు వేలు సంపాదిస్తున్నారు. ఇది న‌మ్మినా న‌మ్మ‌క‌పోయినా ప‌చ్చి నిజం. తాజాగా నిజామాబాద్‌లో ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అరెస్టు చేయ‌డంతో ఈ దందా బ‌య‌ట‌ప‌డింది. ఐదు రూపాయ‌ల‌కు దొరికే డిజిట‌ల్ వాట‌ర్, రెమిడిసివ‌ర్ పేరుతో ఒక్కో ఇంజ‌క్ష‌న్ ను 35 వేల నుంచి 40 వేల‌కు అమ్మారు. క‌రోనా బాధితుడు నిజామాబాద్ వ‌న్ టౌన్ పోలీస్ స్టేష‌న్ లో ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసుల‌కు ఈ మోసం తెలిసొచ్చింది.

  మ‌హేష్ కుమార్ అనే వ్య‌క్తి ఓ ప్రైవేట్ న‌ర్సింగ్ హోంలో చికిత్స చేయించుకుంటున్నాడు. అత‌ని సోద‌రుడు రంజిత్ కుమార్ రెమిడిసివ‌ర్ ఇంజ‌క్ష‌న్ కోసం డాక్ట‌ర్ సాయికృష్ణ అనే ప్రైవేట్ డాక్ట‌ర్ ని క‌లిశాడు. ఆయ‌న రంజిత్ ను స‌తీష్ అనే కాంపౌండ‌ర్ వ‌ద్ద‌కు పంపించాడు. స‌తీష్ ఒక్కో ఇంజ‌క్ష‌న్ 40వేల రూపాయ‌లు అడిగి డిజిట‌ల్ వాట‌ర్ నింపిన సీసాల‌ను ఇచ్చి, ఇదే రెమిడిసివ‌ర్ ఇంజ‌క్ష‌న్ అని చెప్పి పంపించాడు. అది భోగ‌స్ అని తెలుసుకున్న రంజిత్, పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో సాయికృష్ణ‌ను, స‌తీష్ ను అరెస్ట్ చేశారు. నిన్న వైజాగ్‌లోనూ మ‌ధు అనే మ‌హిళ రెమిడిసివ‌ర్ ఇంజ‌క్ష‌న్ల‌కి బ‌దులు వాట‌ర్ క‌లిపిన ఇంజెక్షన్ బాటిల్స్ ఇస్తున్నారంటూ సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన వీడియో సంచ‌ల‌నం రేపింది. తాజాగా నిజామాబాద్ లో ఇదే ఘ‌ట‌న వెలుగుచూసింది.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.