ఓటు అడిగిన ఫ్రాన్స్ అధ్యక్షుణ్ని చెంప చెళ్లుమనిపించిన ఓటర్..

  0
  58

  ఫ్యాన్స్ అధ్య‌క్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్ చెంప ప‌గిలింది. ఓ వ్య‌క్తి అస‌హ‌నంతో, నిర్వేదంతో మాక్రోన్ ద‌వ‌డ ప‌గ‌ల‌గొట్టాడు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌తాసిబ్బంది.. ఆ వ్య‌క్తిని వెన‌క్కి తోసేశారు. అనంత‌రం అరెస్టు చేశారు. స‌ద‌ర‌న్ ఫ్రాన్స్ లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఈ నేప‌ధ్యంలో ప్ర‌జ‌ల మ‌ద్య‌కు వ‌చ్చిన మాక్రోన్… అభివాదం చేస్తూ ముందుకు క‌దిలారు. మ‌ద్య‌లో బ్యారికేడ్లు కూడా ఉన్నాయి. అయితే దూరంగా ఉండ‌కుండా.. బ్యారికేడ్ ద‌గ్గ‌ర‌కే వ‌చ్చి మాక్రోన్ ప్ర‌జ‌ల‌కు అభివాదం చేస్తూ ముందుకుసాగాడు. ఈ క్ర‌మంలో ఓ వ్య‌క్తి వ‌ద్ద క్ష‌ణ‌కాలం పాటు ఆగి ప‌ల‌క‌రిస్తున్నాడు. రెప్ప‌పాటులోనే అత‌ను మాక్రోన్ చెంప‌పై గ‌ట్టిగా చ‌రిచాడు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌తా సిబ్బంది అత‌నిని అరెస్టు చేశారు.

   

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..