లవర్ ఇంటిముందు అమ్మాయి బ్యాండ్ బాజా..

  0
  63

  లవర్ మోసం చేస్తే ఏ అమ్మాయయినా ఏం చేస్తుంది. ప్రేమికుడి ఇంటికెళ్లి న్యాయం కావాలంటుంది. కొందమంది మౌనపోరాటాలు కూడా చేస్తుంటారు. ఇంటిముందే కూర్చుని న్యాయం జరిగే వరకు కదలనంటారు. కానీ ఈ అమ్మాయి మాత్రం అంతకు మించి అంటోంది. లవర్ కి చుక్కలు చూపెట్టింది.
  ఇంతకీ ఏం జరిగింది…?

  ఉత్తర ప్రదేశ్​ గోరఖ్ ​పూర్ కి చెందిన సందీప్ మౌర్య అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. రెండేళ్లుగా వీరు సాన్నిహిత్యంగా ఉంటున్నారు. సందీప్​ తరచుగా ఆ యువతి ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో, సందీప్​ కు ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ఆ యువతిని పట్టించుకోవడం లేదు. కాగా, సందీప్​కు అతని కుటుంబ సభ్యులు, వేరే అమ్మాయితో వివాహం చేయడానికి సిద్ధపడ్డారు. ఈ విషయం ఆ యువతికి తెలిసింది.

  వెంటనే, ఆమె ‘పెళ్లి బాజా, భజంత్రీలు, బరాత్​.. తన మిత్రులు, బంధువులతో కలిసి ప్రియుడి ఇంటి ముందుకు చేరుకుంది. అంతటితో ఆగకుండా తనను పెళ్లి చేసుకోవాలంటూ బ్యాండ్​ వాయిస్తు రచ్చ చేసింది. దీంతో అక్కడ కొద్దిసేపు గందర గోళ పరిస్థితి ఏర్పడింది. కాసేపటికి రంగంలోకి దిగిన పోలీసులు యువతిని సముదాయించడానికి ప్రయత్నించారు. ఆమె మాత్రం అక్కడి నుంచి వెళ్లనని భీష్మీంచుకుని కూర్చుంది.

  ‘తాను, ఆ యువకుడినే పెళ్లి చేసుకుంటానని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తెగేసి’ చెప్పింది. తనను.. ప్రేమ పేరుతో శారీరకంగా కూడా వాడుకుని .. ఇప్పుడిలా మోసం చేస్తున్నాడని పోలీసుల ఎదుట కన్నీటి పర్యంత మయ్యింది. అయితే, పోలీసులు కాసేపటి తర్వాత ఆ యువతిని ఆమె ఇంటికి తరలించారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు లవర్ ని అదుపులోకి తీసుకున్నారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..