ఈ వ్యాక్సిన్ అమ్మాయిని.. ఆ వ్యాక్సిన్ అబ్బాయి

    0
    129

    ఈ వ్యాక్సిన్ అమ్మాయిని
    ఆ వ్యాక్సిన్ అబ్బాయి పెళ్లి చేసుకోకూడదా..?
    పెళ్లిసంబంధాలకోసం ఇచ్చే ప్రకటనల్లో కొత్త ట్రెండ్ వచ్చింది. అమ్మాయిలకోసం అబ్బాయిలు, అబ్బాయిలకోసం అమ్మాయిలు మ్యాచింగ్ కోరేటప్పుడు ఓ నిబంధన జోడిస్తున్నారు. ఇప్పుడిది ఇంటర్నెట్ లో సెన్సేషన్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన ఓ అమ్మాయి, అబ్బాయికోసం మ్యాట్రిమోనియల్ సైట్ లో ఓ ప్రకటన ఇస్తూ, తన అర్హతలన్నీ వివరిస్తూ, తాను కొవిషీల్డ్ రెండు డోసులు వేసేసుకున్నానని, ఆ ప్రకటనలో తెలుపుతూ తాను కోరుకునే అబ్బాయి ఎలా ఉండాలో వివరిస్తూ అతను కూడా కొవిషీల్డ్ రెండు డోసులు వేసుకుని ఉండాలని షరతు పెట్టింది.
    వ్యాక్సిన్ మారితే ఏమవుతుంది..?
    గతంలో కులాల పట్టింపులుండేవి, ఇప్పుడు వ్యాక్సిన్ల పట్టింపులు మొదలయ్యేలా ఉన్నాయి. అవును కొవిషీల్డ్ తీసుకున్న అమ్మాయి, తనకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న అబ్బాయే కావాలని అంటోంది. ఒకవేళ కొవాక్సిన్ అబ్బాయి నచ్చినా అతడ్ని పెళ్లి చేసుకోవడం ఆమెకు ఇష్టం లేదన్నమాట. మరి కొవాక్సిన్ అమ్మాయి, కొవిషీల్డ్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో ఇంకా నిపుణులు చెప్పలేదు. ఒకే వ్యక్తి, ఒకడోసు అది, ఒకడోసు ఇది అన్నట్టుగా వేర్వేరు వ్యాక్సిన్లు కూడా తీసుకోవచ్చనే ప్రయోగాలు జరుగుతున్న ఈ దశలో.. ఇలా డోసులు కలిస్తేనే.. చూపులు కలుస్తాయని చెప్పడం మాత్రం నిజంగా విచిత్రమే..
    ఇదేదో చూసేందుకు కామెడీగానే ఉన్నా, ఇలా చెప్పడంలో ఓ విశేషం ఉంది. ఇటీవల కాలంలో పెళ్లి జరిగిన మరుసటి రోజే, లేదా పెళ్లి జరిగే రోజే.. పెళ్లి కొడుకో, పెళ్లి కూతురో కొవిడ్ పాజిటివ్ తో ఆస్పత్రిలో చేరడం, కొంతమంది చనిపోవడం, వారి బంధువుల్లో కొంతమందికి వైరస్ సోకి మరణాలు సంభవించడం, పూజారుల వల్ల కూడా వధూవరులు ఆస్పత్రి పాలుకావడం, వారిలో ఎవరో ఒకరు చనిపోవడం జరుగుతున్నాయి. అందువల్లే ముందు జాగ్రత్తగా ఆ అమ్మాయి ఇలాంటి ప్రకటన ఇచ్చింది.

    ఇవీ చదవండి..

    నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

    ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

    అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

    నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..