యుద్ధంలో ఉక్రెయిన్ సినీ నటుడు.. బాంబు దాడిలో మృతి.

  0
  199

  ఉక్రెయిన్ సినీ నటుడు పాషాలి , రష్యా బాంబు దాడిలో చనిపోయాడు. పాషాలి ఉక్రెయిన్ లో ప్రముఖ నటుడు.. అతడి వయసు 33 ఏళ్ళు.. ఉక్రెయిన్లపై రష్యా యుద్ధం మొదలైన తరువాత , పాషాలి సైన్యంలో చేరాడు. దేశాన్ని రక్షించుకునేందుకు యువకులు యుద్ధంలో పాల్గొనాలని , దేశ రక్షణకు ముందుకు రావాలని అధ్యక్షుడు ఇచ్చిన పిలుపుతో ఆయన సైన్యంలో చేరాడు. తుపాకీ చేతబట్టి , శత్రుసేనలపై విరుచుకుపడ్డారు. పాషాలి స్పూర్తితో ఎంతోమంది యువకులు యుద్ధంలో చేరారు.

  చనిపోక రెండుగంటలముందు , ఆయన ఒక సైనిక శిబిరంలో కూర్చొని , కొంచెం తీరిక దొరికింది.. దేశంకోసం యుద్ధంలో పాల్గొంటున్నా.. జీవితంలో ఇంత ఆనందం ఎప్పుడూ పొందలేదు.. దేశం కోసం చేస్తున్న పోరాటంలో నా ప్రాణాలు పోయినా జీవితం ధన్యమే ..అంటూ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే , రష్యా బాంబు దాడిలో ఆయన చనిపోయారు..

  ఇదిలా ఉండగా ఉక్రెయిన్ లో వేలమంది మహిళలు తుపాకులు చేతపట్టుకొని శత్రువులపై విరుచుకుపడుతున్నారు. చంటిబిడ్డల తల్లులు కూడా తమ బిడ్డలని సురక్షిత ప్రాంతాల్లో వదిలి , యుద్ధ రంగంలోకి వస్తున్నారు.

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..