రెండున్నర అడుగుల అందగాడు అజీమ్ పెళ్లి .

  0
  271

  ఎట్టకేలకు రెండున్నర అడుగుల అందగాడు అజీమ్ పెళ్లి చేసుకున్నాడు. 32 ఏళ్ల అజీమ్ మన్సూరీ తనకు పెళ్లి చేయమంటూ గత ఏడేళ్లుగా ప్రధాని మొదలుకొని.. స్థానిక సర్పంచ్ వరకూ అర్జీలు పెట్టుకుంటూనే ఉన్నాడు. ఎలాగైతేనేం.. 32 ఏళ్ల ఈ వయసులో అజీమ్ కు పెళ్లి కుదిరింది. బుష్రా అనే రెండడుగుల అమ్మాయి.. ఈ రెండున్నర అడుగుల అజీమ్ పెళ్లి చేసుకున్నాడు.

  ఉత్తర ప్రదేశ్ లోని షామిలీ జిల్లాలో ఈ పెళ్లి జరిగింది. అజీమ్ కు పెళ్లి చేయాలని 2019లో అప్పటి సీఎం అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. అయితే అజీమ్ కు అప్పట్లో సరైన జోడీ దొరకలేదు. ఎట్టకేలకు రెండడుగుల అమ్మాయి పెళ్లి కూతురుగా దొరికింది. పెళ్ళికి [ప్రధాని నరేంద్ర మోడీ నుంచి.. స్థానిక ఎమ్మెల్యే వరకూ అందరికీ ఆహ్వానాలు పంపాడు.

  అత్తర్ దుకాణం నిర్వహించే అజీమ్ పెళ్ళికి కొన్ని వేలమంది వచ్చారంటే ఎవరూ నమ్మరు. వచ్చిన వారికి సెల్ఫీలు ఇవ్వలేక అజీమ్ ఇబ్బందులు కూడా పడ్డాడు. ఉత్తర ప్రదేశ్ లోని చాలా జిల్లాల నుంచి చాలామంది పెళ్లి సంబంధాలు వెతికిన సందర్భాలు కూడా ఉన్నాయి. గత ఏప్రిల్ లో నిశ్చితార్ధం కుదిరినా.. బుష్రా డిగ్రీ పూర్తికాలేదని పెళ్లి వాయిదా వేశారు. తాజాగా ఆమె డిగ్రీ పూర్తి చేసుకొని పెళ్ళికి ఒకే చెప్పడంతో .. ఈ పుణ్యకార్యం పూర్తయింది.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.