ఇండియాలో 30బైకులే అమ్ముతారు..

  0
  213

  ట్రియాంప్ బోనేవిల్లే బైక్. ధర కేవలం 10.65 లక్షలు, అది కూడా ఎక్స్ షోరూమ్ ప్రైస్.. అన్నీ కలుపుకొంటే.. దాదాపు 13లక్షలు కడితే కానీ బైక్ రోడ్డుపైకి రాదు. అంత ఖరీదు ఉన్నా కూడా దీన్ని కొనడానికి చాలామంది ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అయితే సదరు కంపెనీ మాత్రం కేవలం 30 బైకుల్ని మాత్రమే ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 1000 బైకులు తయారవగా.. ఇండియాలో కేవలం 30 మాత్రమే అమ్ముతారట. దీనికోసం ఇప్పటినుంచే పోటీ పెరిగిపోయింది.

  రాయల్ ఎన్ ఫీల్డ్, హార్లే డేవిడ్ సన్.. బైకులు జనసామాన్యంలోకి వచ్చిన తర్వాత, కాస్త స్పెషల్ గా ఉండాలనుకునేవారు ట్రియాంప్ బైక్ లవైపు మళ్లారు. రేటు మరీ ఎక్కువగా ఉన్నా కూడా, వాటిపైనే ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా బోనేవిల్లే మోడల్ అందుబాటులోకి వస్తోంది.

  స్ట్రీట్ ట్విన్, టి-100, టి-120, టి-12- బ్లాక్, స్పీడ్ మాస్టర్.. అనేవి వీటిలో రకాలు. బోనేవిల్లే స్పెషల్ ఎడిషన్ స్ట్రీట్ ట్విన్ గోల్డ్ లైన్. ఈ స్పెషల్ ఎడిషన్ కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా కేవలం వెయ్యి బైకుల్ని మాత్రమే తయారు చేస్తున్న కంపెనీ, వాటిలో 30ని ఇండియాకి పంపిస్తోంది.

  ఇవీ చదవండి

  మందుబాబులు వాక్సిన్ వేసుకోవచ్చా..?

  మాస్క్ లేకపోతె మోకాళ్ళమీద నడిపిస్తారు.

  నౌకను చంద్రుడు కదిలించాడు..

  బుసలు కొట్టే కోడెనాగుపై ఆయన చేయి పడితే అంతే..