స్నేహితురాలి పెళ్లికొచ్చి..శవమైంది..

  0
  1268

  ప్రేమించ‌లేద‌ని… పెళ్ళికి నిరాక‌రించింద‌ని… ఓ యువ‌తిని కాల్చి చంపేశారు. పాకిస్తాన్ లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.
  మైరా జుల్ఫిక‌ర్‌. పాకిస్తాన్ అమ్మాయి. ఉన్న‌త చ‌దువుల కోసం లండ‌న్ వెళ్లింది. న్యాయ‌శాస్త్రంలో ప‌ట్టా పుచ్చుకుంది. అక్క‌డే ఉద్యోగంలో చేరింది. జీవితం సంతోషంగా సాగిపోతోంది. అయితే స్నేహితురాలి పెళ్ళి కోసం తిరిగి స్వ‌దేశానికి రావ‌డ‌మే ఆమెకి శాప‌మైంది. చివ‌రికి ప్రాణం కూడా తీసింది. స్నేహితురాలి పెళ్ళి కోసం పాకిస్తాన్ వ‌చ్చిన మైరా జుల్ఫిక‌ర్ ను.. అదే పెళ్ళిలో ఇద్ద‌రు యువ‌కులు జ‌హీర్, అమీర్‌ చూసి ఇష్ట‌ప‌డ్డారు. ప్రేమిస్తున్నాం, పెళ్ళి చేసుకుంటాం అంటూ వెంట‌ప‌డ్డారు. అయితే ఆమె సున్నితంగా తిర‌స్క‌రించింది. అయినా వ‌ద‌ల‌కుండా త‌మ ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రిని పెళ్ళి చేసుకోవాల‌ని వేధించ‌డం మొద‌లు పెట్టారు. అయితే ఈ విష‌యాన్ని మైరా త‌న మామ‌కు చెప్పుకుంది. దీంతో ఆయ‌న‌ ఆ ఇద్ద‌రు యువ‌కుల‌ను మంద‌లించారు. అయితే స్నేహితురాలి ఇంట్లో మైరా ఉంద‌ని తెలుసుకున్న జ‌హీర్, అమీర్ లు మ‌రో ఇద్ద‌రు స్నేహితుల‌తో అక్క‌డికి వెళ్ళి పెళ్ళి ప్ర‌స్తావ‌న తీసుకొచ్చారు. అందుకు ఆమె స‌సేమిరా అన‌డంతో.. త‌మ వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్చి చంపేశారు.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.