భర్త చితి పక్కనే భార్యకూ అంత్యక్రియలు..

  0
  271

  పెళ్ళై ఏడాదైనా కాకముందే భర్త చనిపోయాడు.. భర్త అంత్యక్రియలు పూర్తి చేసుకొని అందరూ ఇంటికొచ్చారు.. వెంటనే భార్య ఉరివేసుకొని చనిపోయింది.. పచ్చటికాపురంలో విధి ఇలా విషం చిమ్మింది.కర్ణాటకలోని మాండ్య జిల్లా నాగమంగళ తాలూకా , బొమ్మనహళ్లి అనే గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

   

  భార్యా భర్తలిద్దరూ ఈడుజోడులోనే కాదు , తోడూనీడగానే బతికారు.  అన్యోన్యంగా ఉండేవారు. అందుకే విధికి కన్నుకుట్టింది. భర్త కిరణ్ ను , 30 ఏళ్ళ వయసులోనే గుండెజబ్బు బలితీసుకుంది.. కిరణ్‌ గుండెజబ్బుతో బాధపడుతూ బెంగళూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో శనివారం ఉదయం చనిపోయాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. అందరూ ఇంటికి చేరుకున్నతరువాత భార్య పూజ కూడా ఆత్మహత్యచేసుకుంది.. భర్త చితి పక్కనే భార్యకూ అంత్యక్రియలు చేశారు..

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు