రాంగ్ పార్కింగ్ అంటూ ఎంత పనిచేశారో చూడండి…

  0
  943

  ట్రాఫిక్ పోలీసుల చర్యలు ఒక్కసారి నవ్వు తెప్పిస్తాయి. చాలా సార్లు చికాకు అనిపిస్తాయి. ఇదిగో ఇలాంటి సందర్భాల్లో మాత్రం ట్రాఫిక్ పోలీసుల్ని చాలామంది తిట్టుకుంటారు కూడా. ఈ ఘటన పుణెలో జరిగింది. బైక్ తోపాటు, అది నడుపుతున్నవాడిని కూడా ట్రాఫిక్ పోలీసులు అమాంతం పైకెత్తి వ్యాన్ లో కూర్చోబెట్టారు.

  పుణెలోని నానాపేట్ పరిసర ప్రాంతంలో సమర్త్ బ్రాంచ్ ట్రాఫిక్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. నో పార్కింగ్ జోన్ల‌లో ఉన్న వాహనాలను రికవరీ వాహనంలోకి ఎక్కిస్తున్నారు. ఇందులో సమర్త్ బ్రాంచ్‌ కు చెందిన ట్రాఫిక్ పోలీసుతో పాటు అక్కడ కాంట్రాక్ట్ సిబ్బంది పాల్గొన్నారు. అయితే వారు ఓ బైక్‌ను అడ్డు తొలగిస్తున్న సమయంలో.. దాని యజమాని అక్కడి చేరుకుని పోలీసులకు ఎదురు తిరిగాడు. తన బైక్ ని పైకి ఎక్కిస్తే ఊరుకోనన్నాడు. అంతలోనే పోలీసులు బైక్ ఎక్కబోతుంటే, అతను దానిపై ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు తియ్యండి బైక్ ను అంటూ వారికే సవాల్ విసిరాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులకు వళ్లు మండింది. బైక్ తోపాటు దాని ఓనర్ ని కూడా రికవరీ వ్యాన్ లో ఎక్కించేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు వివరణ ఇచ్చుకున్నారు. అతను తన తప్పు తెలుసుకున్నాడని తర్వాత చలాన్ కట్టి బైక్ తీసుకెళ్లాడని చెప్పారు.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్