తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి..

  0
  294

  తెలంగాణ పీసీసీ నూతన చీఫ్ ఎవరన్న ఊహాగానాలకు కాంగ్రెస్ హైకమాండ్ తెరదించింది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ఖ‌రారు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్లు ఉన్న‌ప్ప‌ట‌కీ, రేవంత్ లోని పోరాట నైజమే, ఈ రేసులో అందరినీ వెనక్కి నెట్టినట్టు తెలుస్తోంది. ఇక, ఇదే క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఐదుగురిని నియమించింది.

  జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజారుద్దీన్, మహేశ్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ లను కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమిస్తూ ఓ ప్రకటనలో పేర్కొంది. పీసీసీ ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్, దామోదర్ రెడ్డి, మల్లు రవి, పోదెం వీరయ్య, సురేశ్, వేం నరేందర్ రెడ్డి, రమేశ్ ముదిరాజ్ లను నియమించింది. నూతన పీసీసీ చీఫ్ గా నియమితులైన నేపథ్యంలో రేవంత్ రెడ్డి… తెలంగాణ కాంగ్రెస్ ను ఎలా నడిపిస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..