అమ్మ దొంగా , 32 ఏళ్ళు అటకమీదనే ఉన్నావా..?

  0
  1285

  క‌నిపించ‌కుండా పోయింది తిరిగి క‌నిపిస్తే… దొర‌క‌ద‌ని అనుకున్నది మ‌ళ్ళీ దొరికితే… ఆ కిక్కే వేరు క‌దా. ఇది కూడా అలాంటిదే. అయితే ఇది వ‌స్తువు కాదు. ఓ జీవి. క‌నిపించ‌కుండా పోయిన తాబేలు… ఏకంగా 42 ఏళ్ళ త‌ర్వాత క‌నిపించింది. దీంతో ఆ కుటుంబం ఆనందానికి హ‌ద్దే లేకుండా పోయింది. ఇంట్లో పండ‌గ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.

  బ్రెజిల్ .. రెయోడిజినిరో ప్రాంతంలోని ఓ ఇంట్లో తాబేలును పెట్‌గా పెంచుకున్నారు. 1980 నాటికి ఆ తాబేలు వ‌య‌సు 8 ఏళ్ళు. ఇంట్లో కుటుంబ‌స‌భ్యురాలిగా ఆ తాబేలును చూసుకుంటున్నారు. అయితే అది ఉన్న‌ట్లుండి క‌నిపించ‌కుండా పోయింది. దానికోసం ఆ కుటుంబ‌స‌భ్యులు వెద‌క‌ని చోటంటూ లేదు. ఇరుగుపోరుగు… వీధివాకిలీ అంతా క‌లియ‌తిరిగారు. అయినా ఫ‌లితం లేకుండా పోయింది. చివ‌రికి పోలీస్ కంప్ల‌యింట్ కూడా ఇచ్చారు. ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. దీంతో ఆ తాబేలుపై ఆ కుటుంబం ఆశ‌లు వ‌దులుకుంది.

  మూడేళ్ళ క్రితం ఆ కుటుంబంలోని పెద్ద చ‌నిపోయాడు. ఆయ‌న‌కు వ‌స్తువులు పారేయ‌డం ఇష్టం ఉండేది కాదు. పాత‌బ‌డిన వ‌స్తువైనా, ప‌నికి రాని వ‌స్తువైనా దాన్ని పారేయ‌కుండా అట‌క‌లో దాచేయ‌డం ఆయ‌న అల‌వాటు. ఆ పెద్దాయ‌న మ‌న‌సుని బాధ పెట్టే ఉద్దేశం లేక‌.. ఇంట్లోని మిగిలిన స‌భ్యులు కూడా ప్ర‌శ్నించేవారు కాదు. అయితే మూడేళ్ళ క్రితం మ‌ర‌ణించిన పెద్దాయ‌న ఉండే గ‌ది అట‌కను శుభ్రం చేసేందుకు కుటుంబ‌స‌భ్యులు ప్ర‌య‌త్నించారు.

  సామానంతా తీసి క్లీన్ చేస్తున్న స‌మ‌యంలో వారికి త‌ప్పిపోయింద‌నుకున్న తాబేలు క‌నిపించింది. దీంతో వారంతా ఆశ్చ‌ర్య‌పోయారు. దాన్ని ప‌రిశీలించి చూస్తే.. అది నాడు క‌నిపించ‌కుండా పోయిన త‌మ పెట్ తాబేలు అని గుర్తించారు. చ‌నిపోయిన ఆ ఇంటి పెద్దాయ‌న‌.. వ‌స్తువుల‌ను పైకి చేరే వేసే క్ర‌మంలో .. తాబేలు కూడా పైకి చేరిపోయి ఉంటుంద‌ని గ్ర‌హించారు. అట‌క‌లో దొరికే పురుగులు, చెద‌లు తింటూ అక్క‌డే ఉండిపోయిందా కూర్మం. ఏదైతేనేం ఇప్పుడు ఆ తాబేలు పెరిగి పెద్ద‌దైంది. దాదాపు 42 ఏళ్ళ త‌ర్వాత ఆ తాబేలు వారి కంట ప‌డ‌డంతో సంతోషంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నారు.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..