సినీ పీఆర్వో బీఏరాజు మృతి..

  0
  32

  టాలీవుడ్‌ లో మరో విషాద ఘటన జరిగింది. ప్రముఖ నిర్మాత, పీఆర్వో బి.ఏ. రాజు కన్నుమూశారు. హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని రాత్రి తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సినిమా జర్నలిస్టుగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన.. ‘లవ్లీ’, ‘వైశాఖం’ వంటి చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. సూపర్‌ హిట్‌ అనే మ్యాగజైన్‌ నిర్వహిస్తున్నారు. పలువురు అగ్ర కథానాయకులకు వ్యక్తిగత పీఆర్వోగా వ్యవహరించారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. రెండేళ్ల క్రితమే ఆయన భార్య, దర్శకురాలు బీఏ జయ కన్నుమూశారు.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు