టిక్ టాక్ కేటుగాడు జైలుకి.

  0
  3767

  టిక్‌టాక్‌ వీడియోలతో ఒక మైనర్ అమ్మాయికి వలవేసి , ఆ అమ్మాయి జీవితాన్ని నాశనంచేసిన టిక్‌టాక్‌ ఫేం ఫన్‌ బకెట్‌ మోసగాడు భార్గవ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఈ నీచుడు 14 ఏళ్ల మైనర్‌ బాలికను మాయమాటలతో లోబరుచుకొని అత్యాచారం చేసిన కేసులో భార్గవ్‌ను వైజాగ్ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్ కు తరలించారు. వాడిపై పోక్సో చట్టంకింద కేసు బుక్ చేశారు.భార్గవ్ కు విశాఖ జిల్లా సింహగిరి కాలనీకి చెందిన 14 ఏళ్ల యువతితో చాటింగ్‌లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో మైనర్‌ బాలిక ను టిక్‌టాక్‌ వీడియోల మోజుతో లోబర్చుకున్నాడు.ఆమెకు మాయమాటలు చెప్పి లైంగికంగా వాడుకున్నాడు. అమ్మాయిలో మార్పులు గమనించిన తల్లి , డాక్టరు వద్దకు తీసుకుపోవడంతో అమ్మాయి గర్భవతి అనితేలింది. నిలదీయడంతో నిజం చెప్పేసింది. దీంతో పోలీసు కేసు నమోదుఅయింది. మైనర్ బాలికపై లైంగిక అత్యాచారంకింద కేసుపెట్టి భార్గవ్ ను జైలుకు పంపారు..

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.