తిరుపతి ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

    0
    259

    తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్‌ 17న పోలింగ్ కి మహూర్తం పెట్టేసింది. తిరుపతి ఉప ఎన్నికతోపాటు, ఏప్రిల్‌ 17న నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగేలా ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.
    తిరుపతి ఉప ఎన్నికలకి సంబంధించి ఈనెల 23 నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. ఈనెల 30 వరకు నామినేషన్ల దాఖలుకు తుది గడువుగా ఈసీ నిర్ణయించింది. ఈనెల 31న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్‌ 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువు నిర్ణయించింది. మే2న ఓట్ల లెక్కింపు చేపడతారు. తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మరణంతో అక్కడ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అందరికంటే ముందుగా ఉప ఎన్నికలకోసం టీడీపీతమ అభ్యర్థిని ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ఇక్కడ టీడీపీ తరపున పోటీలో దిగుతారు. ఇక వైసీపీ తరపున ఫిజియో థెరపిస్ట్ గురుమూర్తిని ఆ పార్టీ ఖరారు చేసింది. అయితే అధికారికంగా ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇక బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిపై ఇంతవరకూ సందిగ్ధత నెలకొంది, తాజాగా.. రెండు పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చి బీజేపీ గుర్తుపై అభ్యర్థిని బరిలో దించబోతున్నాయి.

    ఇవీ చదవండి…

    అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

    భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

    ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

    ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??