తిరుపతిలో ఎన్నికల లెక్కలివి.

    0
    452

    తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం చరిత్రలో ఎవరెన్ని చెప్పినా 1962 నుంచి 15 దఫాలు ఎన్నికలు జరిగితే రెండు సార్లు మాత్రమే ఒక సారి బీజేపీ , మరోసారి టీడీపీ గెలిచాయి. మిగిలిన 13 దఫాలు కాంగ్రెస్ లేదా వైసిపి అభ్యర్థులే గెలిచారు. వైసిపి తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ తరువాత రెండు దఫాలు ఆ పార్టీ అభ్యర్థులే గెలిచారు. 1984 నుంచి టిడిపి ఆరు సార్లు పోటీచేస్తే 1984లో ఒక్కసారే గెలిచింది. 1999, 2004, 2014 సంవత్సరాలలో పొత్తులకింద బీజేపీ కి సీటు కేటాయిస్తే 1999లో మాత్రమే 1.58 శాతం ఓట్ల ఆధిక్యంతో బీజేపీ గెలిచింది. 2014లో టీడీపీ , జనసేన మద్దతుతో బీజేపీ రంగంలోకి దిగినా 3. 8 శాతం ఓట్ల ఆధిక్యంతో వైసిపి గెలిచింది. 2019లో ఆ సీటు గెలుచుకున్న వైసిపికి , ఓడిపోయినా టీడీపీకి 18 శాతం ఓట్ల తేడా ఉంది. జనసేన మద్దతు ఇచ్చిన బిఎస్ పి కి 1. 6 శాతం ఓట్లు వచ్చాయి.

    1984లో ఎన్టీఆర్ ప్రచండ ప్రభంజనంలోనే

    . ఈ లెక్కల పద్దులో ఇప్పుడు జరుగనున్న ఎన్నికల్లో హిందుత్వ వేషాలు , అడ్డనామాలు , నిలువునామాలు , సెక్యులర్ వాదనలు , ఇవన్నీ ఓట్లు కురిపించే అస్త్రాలు కానేకావు. 1984లో ఎన్టీఆర్ ప్రచండ ప్రభంజనంలోనే టిడిపికి కాంగ్రెస్ కంటే 5 శాతమే ఎక్కువ ఓట్లు వచ్చాయి.. ఆ తరువాత 1989, 91, 96, 98, 2009, 2019 సంవత్సరాల్లో టీడీపీ ఓడిపోయింది. 2004,2014లో బీజేపీకి మద్దతు ఇచ్చినా ఓటమిపాలైంది. 1999లో మాత్రమే టీడీపీ సపోర్ట్ తో బీజేపీ గెలిచింది. గత చరిత్రలెక్కలు చెప్పే తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో నిజాలివీ ..

    ఇవీ చదవండి…

    అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

    భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

    ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

    ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??