శ్రీవారి దర్శనాలపై కరోనా కాటు..

  0
  422

  దేశంలో కరోనా ఉధృతి పెరుగుతుండటంతో టీటీడీ స్వామివారి దర్శనంలో కీలక మార్పులు చేసింది. కరోనా సెకండ్ వేవ్ ఏపీతో సహా.. అన్ని రాష్ట్రాల్లో భయానకంగా మారడంతో కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా వెళ్తున్నాయి. ఈ పరిస్థితుల్లో స్వామివారి దర్శనం కోసం వచ్చేందుకు 300 రూపాయల టికెట్ బుక్ చేసుకున్న భక్తులు.. తమకు కేటాయించిన సమయాన్ని.. 90 రోజుల వరకూ వాయిదా వేసుకోవచ్చు. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఉండే భక్తులు.. తిరుమల పర్యటన వాయిదా వేసుకునే అవకాశం కల్పించారు. ఈనెల 21 నుంచి 30 వ తేదీలోగా 300 రూపాయల టికెట్ బుక్ చేసుకున్న వారు.. రాలేకపోతే 90 రోజులవరకూ వాయిదా వేసుకోవచ్చు. సర్వదర్శనం టైం స్లాట్ టికెట్లు ఈనెల 11 నుంచి రద్దు చేసిన విషయం తెలిసిందే.. మే నెలకు జారీ చేసే టికెట్లను కూడా 25 వేల నుంచి 15 వేలకు కుదిస్తారని తెలుస్తోంది.

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.