సోమవారం నుంచి తిరుమల సర్వదర్శనం బంద్..

    0
    663

    తిరుమల శ్రీవారి దర్శనం కోసం సర్వదర్శనం 12 వతేది సోమవారం నుంచి రద్దయింది. సర్వదర్శనం టైంస్లాట్‌ టోకెన్ల జారీని ఈ నెల 12 నుంచి నిలిపివేస్తున్నట్లు టీటీడీ ఇదివరకే తెలిపింది. ఆదివారం సాయంత్రం వరకు మాత్రమే టోకెన్లు జారీ చేశారు. సోమవారంనుంచి ఆపేస్తారు. కరోనా కేసులు ఉధృతమవుతున్న క్రమంలో టిటిడి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్లో మహారాష్ట్ర , కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలనుంచి ఎక్కువమంది భక్తులు తిరుమలకు వస్తారు. ఆ రాష్ట్రాలలో కరోనా ఉదృతంగా ఉండటంతో , మన రాష్ట్రంలో కూడా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో టిటిడి ఈ నిర్ణయం తీసుకుంది.

    300 రూపాయల టికెట్లకు ముందుగా బుక్ చేసుకునే భక్తులనుకూడా , ఇక పరిమిత సంఖ్యలోనే అనుమతించే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని షిర్డీ ఆలయంలో కూడా భక్తులకు దర్శనం నిలుపుదల చేసిన విషయం విదితమే.తిరుపతి నగరంలో కూడా కరోనా కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలో సర్వదర్శన టైంస్లాట్‌ టోకెన్ల కోసం వేల సంఖ్యలో భక్తులు క్యూల్లో వేచి ఉంటున్నారు. దీంతో అక్కడ కరోనా వ్యాప్తి చెందే ప్రమాదమున్న పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది.

     

     

     

    ఇవీ చదవండి

    వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

    ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

    టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

    కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ