తిరుమల ఘాట్ రోడ్డుని , మూసివేశారు.

  0
  2231

  భారీ వర్షాల కారణంగా తిరుమల ఘాట్ రోడ్డుని , మూసివేశారు.. ఈ రోజు రాత్రి 8 గంటలనుంచి , రేపు ఉదయం 6 వరకు రెండు రోడ్లలో రాకపోకలు నిషేదించారు.. భారీ వర్ష కారణంగా కొండ చరియల నుంచి రాళ్లు పడే ప్రమాదం ఉంది. టిటిడి. నడకదారిలోని గాలి గోపురం వద్ద వున్న దుకణాలు, రేకుల షెడ్లు పై వృక్షాలు పడటంతో ఆస్తి నష్టం వాటిల్లింది.

  అనేక చోట్ల చెట్లు కూడా పడిపోయాయి.. మెట్ల దారి , పాప వినాశం దారిలో దుకాణాలు కూలిపోయాయి .. దారిలో పడిపోయిన చెట్లను ఎత్తడంలో భక్తులు కూడా తమ వాహనాలు పోయేందుకు సహకరిస్తున్నారు.

  .ఉదయం నుండి నిరంతరాయంగా వర్షం కురుస్తుంది. ఈ భారీ వర్షానికి తిరుమల ముఖద్వారం అయిన అలిపిరి వద్ద నుండి ఇరు ఘాట్ రోడ్డులోను భారీ వృక్షాలు నేలకొరిగాయి. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నా భక్తులు నిదానంగా ప్రయాణాలు కొనసాగిస్తున్నారు.

  రోడ్డుకు అడ్డంగా పడ్డ వృక్షాలను తొలగించే ప్రయత్నంలో అటవీ సిబ్బంది లేని ప్రాంతాలలో భక్తులే వాటిని తొలగించుకుంటున్నారు. ఇక తిరుమల కొండపై అదే పరిస్థితి నెలకొంది

  శ్రీవారి ఆలయ మాడ వీధులతో పాటు అన్ని రోడ్డులు జలమయం అయ్యాయి. భక్తులు దర్శనానికి వెళ్ళడానికి అనంతరం గదులకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

  మరోవైపు కొండపై వున్న దర్శనీయ ప్రదేశాలు అయిన శ్రీవారి పాదాలు, పాపవినాశనం వెళ్ళే దారులు పూర్తీగా మూసివేసింది

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..