వాక్సిన్ రెండు డోసుల మధ్య టైం పెరిగితే ?

  0
  1083

  కరోనా వాక్సిన్ రెండు డోసుల మధ్య కాల వ్యవధి పెంచితే వాక్సిన్ బాగా పని చేస్తోందని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రా జెనికా కోవీ షీల్డ్ విషయంలో పరిశోధన చేసి.. ఈ విషయాన్ని నిర్ధారించారు. ఇందుకోసం ఏర్పాటైన కమిటీ వచ్చే వారంలో తమ తుది నివేదికను ప్రకటించనుంది. భారత్ లో పూణేలో తయారవుతున్న కోవీ షీల్డ్, రెండు డోసుల మధ్య కాలవ్యవధిని నాలుగు నుంచి ఆరు వారాలుగా నిర్ణయించింది. దాని తర్వాత మొదటి డోసుకు, రెండవ డోసుకు మధ్య కాలవ్యవధిని ఆరు వారాలకు మార్చింది.

  కాలవ్యవధి ఇలా పెంచినపుడు వాక్సిన్ సామర్ధ్యం 81.3 శాతం పెరుగుతుందని తెలిపింది. ఆరు వారాల్లోపు అయితే 55.1 శాతం మాత్రమే పని చేస్తోందని తేల్చారు. బ్రిటన్, కెనడా దేశాల్లో రెండు డోసుల మధ్య కాలవ్యవధి 12 నుంచి 16 వారాలుగా ఉంది. ఇందువలన వాక్సిన్ తీసుకున్నవారిలో వ్యాధి నిరోధక శక్తి పెరిగింది. రెండు డోసుల మధ్య వ్యత్యాసం ఎక్కవగా ఉంటే వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటూ.. తొలివిడత డోసును ఎక్కువమందికి ఇచ్చేందుకు కూడా ఈ విధానం బాగా పనిచేస్తుంది. బ్రిటన్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా దేశాల్లో వాక్సిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ పరిశోధనల్లో మొదటి డోసు వాక్సిన్ వేసుకున్న 22 రోజుల తర్వాత వ్యాధి వచ్చినా.. దాని తీవ్రత చాలా తగ్గిందని తేలింది. మొదటి డోసు తర్వాత 76 శాతం రెండవ డోసు తర్వాత 82 శాతం వాక్సిన్ పనిచేసింది.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.