ఆ పాము కాలేజీ బ్యాగులో దూరి , మూడో సారి కాటేసింది.. ప్రాణం తీసింది.

  0
  1047

  పాము పగపడుతుందా ..? అది నిజంకాదని సైన్స్ చెబుతుంది.. అయితే ఆదిలాబాద్ జిల్లా , బేదోడ గ్రామంలో డిగ్రీ చదివే ప్రణాళి అనే ఈ 18 ఎళ్ల అమ్మాయిని వెంటాడి , వేటాడి పాము ఎందుకు కాటేస్తుంది..? రెండు దఫాలు పాముకాటుకు గురై , బ్రతికి బయటపడ్డప్పటికీ , మూడో సారి ప్రాణాలే కోల్పోవలసి వచ్చింది..

  విచిత్రంగా మూడో దఫా కాటేసిన పాము , ఆమె కాలేజీ బ్యాగులో ఉండింది. కాలేజీ నుంచి వస్తూ , తెచ్చుకున్న హోలీ రంగులకోసం , బ్యాగులో చెయ్యి పెడితే , అది కాటేసింది. రెండు సార్లు , పాము కాటునుంచి బయటపడ్డ ప్రణాళి , మూడో దఫా తప్పించుకోలేకపోయింది. మొదటి దఫా , ఆరు నెలల క్రితం ఇంట్లో నిద్రపోతుంటే , పాము చేతిమీద కాటేసింది. అప్పుడు దాదాపు , 4 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి బ్రతికించుకున్నారు. తరువాత , మళ్ళీ ఈ ఏడాది జనవరిలో పాము కాటేసింది.. మళ్ళీ అతికష్టంమీద బ్రతికింది.

  అప్పటినుంచి అమ్మాయిని , కంటికిరెప్పలా కాపాడుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా కాలేజీ బ్యాగులోనే దూరి , ఆమె హోలీ రంగులకోసం , చేయిపెడితే , కాటేసింది.. హాస్పిటల్లో చనిపోయింది. ఇది విధివిచిత్రమో , పగపట్టిన పాము చేసిన దారుణమో , లేక కాకతాళీయమో గానీ , అమ్మాయి జీవితం ఇలా అనూహ్యంగా ముగిసిపోయింది..

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..