లాక్ డౌన్ లో దొంగతనం ఎంత కష్టమో తెలుసా..? 

    0
    51

    లాక్ డౌన్ లో దొంగతనం ఎంత కష్టమో తెలుసా..? లాక్ డౌన్ టైమ్ లో.. షాపులన్నీ ఎక్కువ సేపు మూసే ఉంటున్నాయి. అంటే దొంగతనాలకి కూడా బాగా అవకాశం ఉంటుందన్నమాట. ఇదే అదనుగా ఓ కుర్రదొంగ ఓ షోరూమ్ లోకి దూరాడు. షాపు తెరచి ఉన్న టైమ్ లో షోరూమ్ లోకి వెళ్లి అక్కడే ఉండిపోయాడు. సిబ్బంది దాన్ని మూసివేసి వెళ్లిపోయిన తర్వాత తీరిగ్గా క్యాష్ బాక్స్ వద్దకు వెళ్లి అందులో దొరికినదంతా జేబులో వేసుకున్నాడు.

    అంతా బాగుంది కానీ తిరిగొచ్చే ఉపాయం అతడికి తట్టలేదు. ఎలాగోలా తంటాలు పడి ఆ బిల్డింగ్ పైనుంచి జాగ్రత్తగా కిందకు జారుకునేందుకు ప్రయత్నించాడు. వాటం దొరక్క పోవడంతో తాడు పట్టుకుని నానా ఇబ్బంది పడ్డాడు.

    దొంగని చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు పోలీసులు అతడి అవస్థ చూసి చేయందించారు. సాయం చేసి రక్షించారు, ఆ తర్వతా చేతులకు బేడీలు వేశారు. ఈ వ్యవహారం జైపూర్ లోని టాటూ బాబా అనే షోరూమ్ లో జరిగింది.

    ఇవీ చదవండి..

    ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

    వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

    కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

    రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు