ఏపీ – తెలంగాణ సరిహద్దుల్లో అలజడి..

  0
  41

  ఏపీ – తెలంగాణ సరిహద్దుల్లో దయనీయపరిస్థితులు ఒక వైపు , ఉద్రిక్త పరిస్థితులు మరోవైపు కనిపిస్తున్నాయి. ఏపీ నుంచి రోగులను తీసుకొచ్చే అంబులెన్సులను అనుమతిలేకుండా తెలంగాణలోకి రానిచ్చే ప్రసక్తేలేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. దీంతో కృష్ణ , కర్నూల్ సరిహద్దులవద్ద ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను ఆపేస్తునారు. అంతరాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్ లను ఆపే చర్య , బహుశా దేశంలో తెలంగాణ ప్రభుత్వమే తీసుకుంది.హైదరాబాద్ లో పరిస్థితి అదుపు తప్పిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో ఈ నిర్ణయం తీసుకుంది. మందులు , ఆక్సిజన్ సరఫరాలో వైఫల్యంతో ప్రయివేట్ ఆసుపత్రుల్లో అయినా వైద్యం అందించాలని ఇలాంటి నిర్ణయం తీసుకుంది.

  గత ఏడాది దేశ వ్యాప్త లాక్ డౌన్ లో కూడా ఇలాంటి ఆంక్షలు లేవు. ఒకరకంగా అంతరాష్ట్ర రవాణాపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి అమానవీయ నిర్ణయం తీసుకుంది. వారం క్రితం తెలంగాణ హైకోర్టు కూడా ఇది అమానుషమని పోలీసులను మందలించింది. అంబులెన్స్ లను ఆపొద్దని ఆదేశించింది. అయినా కేటీఆర్ ఆదేశాలతో ఇప్పుడు సరిహద్దుల్లో అంబులెన్స్ లు ఆపుతున్నారు. దీనికి ప్రతిగా కర్నూలులో సరిహద్దులవద్ద బిజెపి కార్యకర్తలు తెలంగాణ నుంచి వచ్చే వాహనాలను అడ్డుకుంటున్నారు.. దీంతో ఈ సమస్య రెండు రాష్ట్రాలమధ్య అనవసర స్పర్ధలకు కారణం అవుతుంది..

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.