గత ఐదేళ్లలో లేనంతగా మండిపోనున్న ఎండలు..

  0
  63

  రేపటి నుంచే.. మండేకాలం..గత ఐదేళ్లలో లేనంతగా మండిపోనున్న ఎండలు..
  రేపటి నుంచి మండేకాలం మొదలుకానుంది. నేటితో సాధారణ ఎండల ప్రభావం ముగిసిపోతుంది. ఇక రేపటి నుంచి అసలైన ఎండా కాలం మొదలౌతుంది. ఇక అన్నీ జిల్లాల్లో కనీస ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పైగానే నమోదవుతాయి. రాబోయే రోజుల్లో ఎండలు మరింత ఎక్కువగా ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈసారి ముందుగానే వేడిగాలులు మొదలయ్యాయంటున్నారు. ఇదిలా ఉంటే కొన్ని ప్రాంతాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.

  గత 5 సంవత్సరాలతో పోలిస్తే ఈ సారి ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వెదర్ బ్లాగర్స్ చెబుతున్నారు. ముఖ్యంగా వృద్దులు, చిన్నారులు ఎండల సమయంలో బయట తిరగకుండా ఉండటమే మంచిదని అంటున్నారు. ఒక వేళ బయటకు వెళ్లాల్సి వస్తే తప్పని సరిగా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మరో వైపు స్కూళ్లకు కూడా 14వ తేదీ నుంచి ఒంటిపూట బడులను పెట్టనున్నారు.

  పగలు అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటే.. రాత్రి సమయంలో పడిపోతున్నాయి. రాత్రివేళల్లో చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది.. కొన్నిచోట్ల మంచు కురుస్తోంది. రాయలసీమలోనూ రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉన్నాయి. ఒడిశాలోని గత మూడు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదుకావడంతో అక్కడ ఎండల తీవ్రత పెరిగిందని, దీని కారణంగా ఉత్తరం నుంచి వేడిగాలులు ప్రభావంతోనే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు.

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..