సినిమా షూటింగులు ఆగిపోయాయి..

  0
  26

  టాలీవుడ్ ప్యాకప్..
  =============
  టాలీవుడ్ చిత్రపరిశ్రమను, కరోనా సెకండ్ వేవ్ అతలాకుతలం చేస్తోంది. కరోనా ఫస్ట్ వేవ్ భయం పూర్తిగా పోయి.. ఇప్పుడిప్పుడే సినిమాలు విడుదల అవుతున్నాయి. అయితే.. వరుసగా టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు కరోనా బారిన పడుతుండటంతో ఇండస్ట్రీలో టెన్షన్ మొదలైంది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ అలెర్ట్ అయ్యింది. పెద్ద సినిమాల దర్శకులు, నిర్మాతలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమ షూటింగులకు ప్యాకప్ చెప్పేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీ షూటింగ్ కూడా నిలిచిపోయింది.

  క్రిష్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు కూడా నిలిచిపోయింది. అసలే పవన్ కళ్యాణ్ కరోనా సోకి.. చికిత్స తీసుకుంటున్నాడు. ఇక పవన్ మళ్ళీ ఎప్పుడు మేకప్ వేసుకుంటాడో చెప్పలేని పరిస్థితి.. ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్, రాధే శ్యామ్ చిత్రాలు కూడా కరోనా కారణంగా నిలిచిపోయాయి. ఇక మహేష్ బాబు నటిస్తున్న సర్కారువారి పాట మూవీకి కరోనా ఇబ్బందులు తప్పలేదు. మహేష్ కూడా షూటింగ్ వద్దని చెప్పేయడంతో ఈ మూవీ కూడా నిలిచిపోయింది. రాజమౌళి దర్శకత్వంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న RRR మూవీ కూడా కరోనా కారణంగా ఆగిపోయింది. ఏదిఏమైనా.. ఇలా వరుసగా సినిమాలన్నీ షూటింగులను ఆపేయడంతో టాలీవుడ్ లో సంక్షోభం తప్పేలా కనిపించడం లేదు.

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.