చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీకి ఎదురు దెబ్బ..

  0
  249
  చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో
  టీడీపీకి ఎదురు దెబ్బ..
  చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం ఎదురైంది. నియోజకవర్గంలోని మొత్తం 94 పంచాయతీల్లో 4 ఏకగ్రీవం కాగా.. మిగిలిన 89 పంచాయతీలకు మూడో దశలో ఎన్నికలు జరిగాయి. వీటిలో 74చోట్ల వైసీపీ బలపరచిన అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. 14పంచాయతీల్లో మాత్రమే టీడీపీ బలపరచిన అభ్యర్థులు గెలిచారు. ఒకచోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.
  2013కి ఇప్పటికి ఎంతో తేడా..
  2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఇప్పుడు వైసీపీ హయాంలో దాదాపుగా క్లీన్ స్వీప్ జరిగినట్టే భావించాలి. గతంలో చంద్రగిరి వదిలి కుప్పం నియోజకవర్గానికి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఓటమి భయంతో మరో నియోజకవర్గం వెతుక్కోవాల్సి ఉంటుందని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.