బీజేపీ జోక్యం అసలుకే మోసం

    0
    176

    తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో డీఎంకే తమిళనాడులో అధికారంలోకి వస్తుందన్న విషయం దాదాపు అన్ని సర్వే సంస్థలు తేల్చాయి. డీఎంకే, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైన సీట్లను సులభంగా దక్కించుకోగలదని తేల్చాయి. మొత్తం 234 స్థానాలకు గాను, ప్రభుత్వ ఏర్పాటుకి 118 స్థానాలు అవసరం. అయితే డీఎంకే 154నుంచి 162 స్థానాలు గెలుచుకోగలదని అంచనా వేస్తున్నారు. తమిళ రాజకీయాల్లో బీజేపీ రంగ ప్రవేశం చేసి, కలగూరగంపగా తయారు చేసింది. అన్నాడీఎంకే పార్టీతో జతకట్టి తానే పెద్ద దిక్కు పాత్ర పోషించి, పొత్తుల విషయమై చర్చలు జరుపుతుండటంతో మొదటికే మోసం వచ్చింది. ఇప్పటి వరకు అన్నా డీఎంకే, శిబిరంలో కలకలం చెలరేగింది. ముగ్గురు మంత్రులతో సహా దాదాపు 41మంది సిట్టింగ్ లకు సీట్లు దక్కలేదు. వీరంతా టీటీవీ దినకరన్ శిబిరంలోకి వెళ్లిపోయారు.

    శశికళ క్రియాశీలక రాజకీయాలనుంచి విరమించుకున్నట్టు ప్రకటించినా, ఆమె వర్గీయులు మాత్రం అన్నాడీఎంకేకు సహకరించే పరిస్థితుల్లో లేరు. మరోవైపు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల మధ్య కార్చిచ్చు మొదలైంది. అన్నా డీఎంకేలో.. పొత్తులు పోను కొత్తవారికి కూడా అవకాశం దక్కడంతో 60మంది సీట్లు కోల్పోయినవారు ఇప్పుడు దినకరన్ పార్టీవైపే చూస్తున్నారు. మరోవైపు అన్నాడీఎంకే కూటమినుంచి డీఎండీకే, ఎంఎంఎంకే లాంటి పార్టీలు కూడా వైదొలిగాయి. వీళ్లు కూడా టీటీవీ దినకరన్ తో చర్చలు జరుపుతున్నారు. ఇలా.. రాజకీయంగా అన్నా డీఎంకేలో అసంతృప్తి జ్వాలలు మిన్నంటాయి. ఓట్లు చీలిపోకుండా కాపాడాలనే ప్రయత్నం వృథా అయింది. మొత్తమ్మీద అన్నాడీఎంకేలో అనామకుల పాలనపై బీజేపీ పరోక్ష పెత్తనంపై తమిళ ప్రజలు ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చేశారు. డీఎంకేకు పట్టం కట్టడం, దాదాపు ఖాయమైపోయింది.

    ఇవీ చదవండి…

    అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

    భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

    ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

    ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??