ఏపీ పంచాయతీ ఎన్నికల్లో తొలి దశలో పోటీ చేయబోతున్న సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యలకు గుర్తులను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. సర్పంచ్ అభ్యర్థులకు మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, కప్పు సాసరు, క్యారెట్, తాళం చెవి, గొలుసు, కుర్చీ, బ్యాట్, ఫోన్, బల్ల, మొక్కజొన్న, పలక, దాక్షపళ్లు, తిరగలి, కుండ, అరటిపండు, కొవ్వొత్తులు, నల్లబోర్డు, అనాసపండు, షటిల్, చేతికర్ర, చెంచా గుర్తులున్నాయి.
ఇక వార్డు సభ్యులకు ఇరవై గుర్తులు కేటాయించారు. అందులో ప్రెషర్ కుక్కర్, గౌను, స్టూలు, ఇస్త్రీ పెట్టె, పోస్టు డబ్బా, గ్యాస్ పొయ్యి, బీరువా, ఐస్‌క్రీమ్, కెటిల్, కటింగ్ ప్లేయర్, గరాటా, విద్యుత్ స్తంభం, డిష్ యాంటీనా, రంపం, కెమెరా, క్యారమ్ బోర్డు, వయోలిన్, బెండకాయ, బెల్టు, కోటు గుర్తులున్నాయి.
ఇక తొలి సారిగా పంచాయతీ ఎన్నికల్లో నోటా గుర్తును ముద్రించబోతున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఈ గుర్తు లేదు. కానీ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని రకాల ఎన్నికల్లో ఈ గుర్తును తప్పనిసరి చేశారు. దీంతో ఏపీలో జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో కూడా నోటా గుర్తును చేర్చారు. అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల అనంతరం చివర్లో నోటాను ముద్రిస్తారు.
ఇవి కూడా చదవండి..
https://ndnnews.in/single-shirt-cost-75-thousand-rupees-only/