స్విఫ్ట్ కారుకి ఆ పేరు ఎలా వచ్చింది..?

  0
  235

  బైక్ లు కానీ, కార్లు కానీ.. వాహనాల మోడళ్లకు పెట్టే పేర్ల వెనక చాలా అర్థం ఉంటుంది. వాటి స్టామినాని తెలియజేసే విధంగా ఆ పేర్లు పెడుతుంటారు. యూనికార్న్, సమురాయ్.. ఇలా వాహనాల మోడళ్లకు పెట్టే పేర్లు ప్రత్యేకంగా ఉంటాయి. మారుతి-సుజుకి కంపెనీ తయారు చేసిన స్విఫ్ట్ కారు పేరు వెనక కూడా ఇలాంటి ఓ ఆసక్తి కర కథ ఉంది.

  స్విఫ్ట్ అనేది ఓ పక్షి. అది సుమారు 35నుంచి 40 గ్రాముల బరువు ఉంటుంది. ఆ జాతిలో అతి చిన్న పక్షి బరువు కేవలం 22 గ్రాములు. పెద్ద పక్షి అయితే దాదాపు 60 గ్రాములు బరువు మాత్రమే ఉంటుంది. సంవత్సరంలో ఈ పక్షి 10 నెలలపాటు ఎగురుతూనే ఉంటుంది. సగటున రోజుకి 550 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. హమ్మింగ్ బర్డ్ కి దీనికి పోలికలుంటాయి. గంటకి 169 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సత్తా కూడా ఈ పక్షి సొంతం. ఒక సంవత్సరంలో అత్యథికంగా 2 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేయగలదు ఈ పక్షి. జీవిత కాలం మొత్తంలో 20లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. ప్రతి ఖండంలోనూ ఇవి ఉంటాయి. అంటార్కిటాలో, ఎడారుల్లో, దీవుల్లో తప్ప మిగతా అన్ని చోట్ల ఈ పక్షులు కనిపిస్తాయి. ఇవి వలస పక్షులు కూడా. ఒకే చోట స్థిరనివాసం అంటూ ఏర్పరచుకోవు.

  స్విఫ్ట్ అనే ఈ పక్షి చాలా చిన్నగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, బలంగా ఉంటుంది. కారు కూడా చిన్నగా బలంగా ఉంటుందనే సందేశాన్ని ఇవ్వడానికే దానికి స్విఫ్ట్ అనే పేరు పెట్టారు.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు