జొమాటో కేసులో అసలు ట్విస్ట్ తెలుసా..?

  0
  1008

  జొమాటో డెలివరీ బాయ్ దాడి చేశారంటూ ఓ యువతి హల్ చల్ చేయడం, అతనిపై కేసు పెట్టడం, ఆ డెలివరీబాయ్ ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించడం అంతా జరిగిపోయింది. అయితే ఇప్పుడు కేసులో అసలు ట్విస్ట్ మొదలైంది. ఏ పోలీస్ స్టేషన్లో ఆ యువతి తనపై కేసు పెట్టిందో అదే స్టేషన్లో ఆమెపై డెలివరీ బాయ్ కూడా కేసు పెట్టాడు. తనపై ఆ యువతి కావాలని దాడి చేసిందని చెప్పాడు. దీంతో ఆ యువతిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

  గత కొద్ది రోజులుగా బెంగళూరులో ఓ యువతి – జొమాటో డెలివరీ బాయ్‌ మధ్య జరిగిన వివాదం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఫుడ్‌ డెలివరీ ఆలస్యం కావడంతో ఆ ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేసిన మహిళా కస్టమర్‌ పై జొమాటో డెలివరీ బాయ్‌ దాడి చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో డెలివరీ బాయ్‌ కామరాజ్‌ ను బెంగళూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం బెయిల్‌ మీద విడుదలైన కామరాజ్‌ ఆ యువతిపై కేసు పెట్టాడు. తాను ఆ యువతిపై దాడి చేయలేదని, డెలివరీ ఆలస్యం అయినందుకు ఆమెకు క్షమాపణలు కూడా చెప్పానని అన్నారు కామరాజ్. ఆర్డర్‌ క్యాన్సిల్‌ అయినందున ఫుడ్‌ తిరిగి ఇచ్చేయాల్సిందిగా కోరానని, కానీ ఆమె అంగీకరించలేదని చెప్పారు. తన మీదకు షూ విసిరిందని కూడా ఆరోపించాడు. తనను తాను గాయపరచుకుని నాటకాలాడుతోందని అన్నాడు.

  కామరాజ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువతి మీద ఐపీసీ 341, 355, 504 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఆ యువతి మాత్రం తాను డెలివరీ బాయ్ ని తిట్టలేదని, ముందు అతనే తనపై దాడికి ప్రయత్నించాడని చెబుతోంది. ప్రస్తుతం వీరిద్దరి వ్యవహారంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఎవరికి వారు మీమ్స్ చేసి వదులుతున్నారు.

  ఇవీ చదవండి…

  అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

  భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

  ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

  ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??