హీరో రామ్ చరణ్ డ్రస్సింగ్ స్టైల్ ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. ఈమధ్య మాలధారణలో కనిపించిన చరణ్.. తాజాగా.. సరికొత్త లుక్ లో అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. రాయల్ బ్లూ టీ షర్ట్ లో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో తళుక్కున మెరిశాడు.
Power Star #RamCharan was photographed at the Hyderabad International Airport in a stylish royal blue sweatshirt. pic.twitter.com/gf9RXLucj4
— Filmfare (@filmfare) November 12, 2021
రామ్ చరణ్ టీషర్ట్ పై పెద్ద పాము బొమ్మ ఉండటం విశేషం. అది ఉపాసన సెలక్షన్ అంటున్నారు. జంతు ప్రేమికురాలైన ఉపాసన.. ఎక్కువగా ఇలాంటి పర్యావరణానికి సంబంధించిన దుస్తులపైనే ఆసక్తి చూపిస్తుంటారు. రామ్ చరణ్ కోసం ఆమె ప్రత్యేకంగా సెలక్ట్ చేసిన టీషర్ట్ ఇదని చెబుతున్నారు.
ఇటీవలే చరణ్ ఆర్ఆర్ఆర్ నాటు-నాటు పాట అభిమానులకు పూనకాలు తెప్పించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టెప్పులు ఈ పాటలో బాగా హైలెట్ అయ్యాయి. త్వరలో సినిమాకి సంబంధించిన ప్రమోషన్ ని ఫుల్ లెంగ్త్ లో మొదలు పెట్టబోతున్నారు దర్శకుడు రాజమౌళి.