హీరోగా బండ్లగణేష్.. హీరోయిన్ ఎవరంటే..?

  0
  153

  ప్రముఖ నిర్మాత, క్యారెక్టర్ ఆర్టిస్ట్ బండ్లగణేష్ హీరోగా మారుతున్నట్టు తెలుస్తోంది. గతంలో కమెడియన్ గా రాణించిన బండ్ల, ఆ తర్వాత నిర్మాతగానూ సత్తా చాటాడు. స్టార్ హీరోలతో సినిమాలు తీసి టాప్ ప్లేస్ కి వెళ్లాడు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని, సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. బ్లేడ్ గణేష్ గా ఆ సినిమాలో బండ్ల చేసిన క్యారెక్టర్ పెద్దగా పండలేదు. దీంతో ఆ తర్వాత మరోసారి గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆయన హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారట. గతంలో కూడా బండ్ల గణేష్ హీరోగా మారబోతున్నట్లు వార్తలొచ్చినా వాటిని ఆయన ఖండించారు. అయితే తాజాగా బండ్ల.. వెంకట్ అనే కొత్త దర్శకుడి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. పూర్తి వినోదభరితంగా సాగే ఈ కథలో, ప్రధాన పాత్రను బండ్ల గణేశ్ చేయబోతున్నాడట. నిర్మాతగా, హాస్యనటుడిగా రాణించిన బండ్ల.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. స్టార్ హీరోయిన్ కోసం వెదుకులాట మొదలైంది. ఇప్పటికే కొంతమంది టాలీవుడ్ టాప్ హీరోయిన్లతో చర్చలు జరిగాయట. అయితే కామెడీ సినిమాల్లో తాము నటించలేమని వారు నో చెప్పారట. ఫైనల్ గా ఓ హీరోయిన్ మాత్రం బండ్లకు ఓకే చెప్పిందట. ఆమె ఎవరో, సినిమా మొదలయ్యేది ఎప్పుడో.. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుంది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.