మెగా ఫ్యామిలీకి నా ఉసురు తగిలింది.

  0
  857

  టాలీవుడ్‌లో న‌డుస్తోన్న హాట్ టాపిక్ న‌రేష్-ప‌విత్ర బంధం గురించే. ఇప్పుడీ టాపిక్‌లోకి కాంట్ర‌వ‌ర్శ‌ల్ యాక్ట్రెస్ శ్రీరెడ్డి ఎంట‌రైంది. న‌రేష్-ప‌విత్ర‌ల అప‌విత్ర బంధంపై త‌న‌దైన శైలిలో ర‌ఫ్ఫాడించింది. గ‌తంలో మీటూ ఉద్య‌మం చేస్తోన్న స‌మ‌యంలో ప‌విత్ర ఓ ఇంట‌ర్వూలో త‌న‌పై చేసిన కామెంట్ల‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది. పవిత్ర అని పేరు పెట్టుకున్న నువ్వు ఎంత మందితో అయినా రిలేషన్స్ పెట్టుకోవచ్చు గానీ.. మేము మీటూ ఉద్య‌మం గురించి మాట్లాడితే… డబ్బులు తీసుకుని, తేడా వ‌స్తే.. రివ‌ర్స్ అవుతారంటూ ప‌విత్ర చేసిన వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేశారు. ఇప్పుడు నీ ప‌రిస్థితి ఏంటి అంటూ ప్ర‌శ్నించింది. పవిత్రకు ఎంతో మందితో రిలేషన్స్ ఉన్నాయని ఆమె చాలామంది జీవితాల్లో నిప్పులు పోసిందని ఆరోపించింది. అసలు నరేష్ భార్య విషయంలో కలగ చేసుకోవడానికి నువ్వు ఎవరు? ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి నువ్వు ఎవరు? మీ గురించి ఆమె మాట్లాడేందుకు హక్కు ఉంది కానీ ఆమె గురించి మాట్లాడేందుకు మీకు ఏమి హక్కు ఉంది? అంటూ నిల‌దీసింది.

  న‌రేష్ గురించి ప్ర‌స్తావిస్తూ.. నేను మీటూ ఉద్యమం చేస్తున్నప్పుడు నన్ను మా అసోసియేషన్ నుంచి బ్యాన్ చేశాడని, నేను అర్ధనగ్నంగా కూర్చుని నిర‌స‌న వ్య‌క్తం చేసిన ప్ర‌దేశాన్ని యాసిడ్ తో కడగాలంటూ కామెంట్ చేశాడని ఆమె గుర్తు చేస్తూ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తింది. నాలుగైదు పెళ్ళిళ్ళు చేసుకుని, ఎంత‌మందితోనైనా రిలేష‌న్స్ పెట్టుకునే నువ్వు ప‌విత్రుడివా అంటూ మండిప‌డింది.

  ఇక మెగాఫ్యామిలీపై కూడా మ‌రోసారి ఓ రేంజ్‌లో ఫైర్ అయింది శ్రీరెడ్డి. న‌న్ను కామెంట్ చేసిన మెగా ఇంట్లోని ముగ్గురు ఆడ‌పిల్ల‌లు ఎలా ఉన్నారో.. వారి బాగోతాలు ఏంటో అంద‌రికీ తెలుసంటూ చుర‌క‌లు వేసింది. క‌ళ్యాణాల‌ ప‌వ‌న్ చెప్పేవ‌న్నీ శ్రీరంగ‌నీతులే అని, చేసేదంతా మ‌రొక‌ట‌ని చెప్పుకొచ్చింది. అందుకే వారి సినిమాల‌న్నీ అట్ట‌ర్ ఫ్లాపులు అవుతున్నాయ‌ని ఎద్దేవా చేసింది. అల్లు అర్జున్ ఒక్క‌డే టాలెంటెడ్ హీరో అని కితాబిచ్చింది.

  తన మీటు ఉద్యమం గురించి హేళనగా మాట్లాడిన జీవితా రాజ‌శేఖ‌ర్ గురించి కూడా కామెంట్ చేసింది శ్రీరెడ్డి. ఇప్పుడు వారంతా కేసుల్లో ఇరుకున్నార‌ని పేర్కొంది. తాను ఇబ్బందులలో ఉన్నప్పుడు వీరంతా మరింత ఇబ్బంది పెట్టారని గుర్తు చేసింది. కానీ ఆ రోజు తాను ఏమీ మాట్లాడకుండా వదిలేశానని నాకు కూడా టైం వస్తుంది కదా అని ఎదురుచూస్తున్నాన‌ని, ఇప్పుడా టైం త‌న‌కు వ‌చ్చిందంటూ పేర్కొంది.

  నా ఉసురు వారికి త‌గిలింది. త‌న‌ను ఇబ్బందుల‌కు గురి చేసిన వారంతా ఇప్పుడు క‌ర్మ‌ఫ‌లం అనుభవిస్తున్నారు. నా క్యారెక్ట‌ర్ గురించి మాట్లాడిన వారి జీవితాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడండి. నా జీవితం నాశ‌నం చేసి వాళ్ళంతా అప్పుడు న‌వ్వుకున్నారు.. కానీ నేను త‌మిళ‌నాడులో బాగానే ఉన్నా.. కానీ వాళ్ళ ప‌రిస్థితి ఏలా ఉందో అంటూ ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. ఆడ‌పిల్ల‌ను ఏడిపించిన ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక రోజు క‌ర్మ‌ఫ‌లం అనుభ‌వించ‌క త‌ప్ప‌దు అంటూ చివ‌ర‌లో ఎమోష‌న‌ల్ అవుతూ క‌న్నీటిపర్యంత‌మైంది.

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.