విద్యార్థి చనిపోతే కోటి పరిహారం ఇవ్వాలి..

  0
  196

  ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. జులైలో పరీక్షలు నిర్వహిస్తామని, 15రోజుల ముందే షెడ్యూల్ ప్రకటిస్తామని ఏపీ సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేయడంపై ఈరోజు పలు ప్రశ్నలను సంధించింది ధర్మాసనం. 15రోజుల ముందు షెడ్యూల్ ప్రకటిస్తే పిల్లల ప్రిపరేషన్ కి టైమ్ సరిపోతుందా అని అడిగింది. గదికి 15 లేదా 20మంది విద్యార్థులను అనుమతిస్తే కరోనా సోకదా అని అడిగింది. అదే సమయంలో పరీక్షలు నిర్వహించడమే కాదు, వాటి మూల్యాంకనం, మార్కుల ప్రకటన వంటివి కూడా ఉంటాయి కదా, దానికి సంబంధించిన వివరాలు అఫిడవిట్ లో ఎందుకు పొందుపరచలేదని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో రావాలని, దీనిపై రేపు విచారణ చేపడతామని చెప్పింది ధర్మాసనం.
  సుప్రీంకోర్టు తీరు చూస్తుంటే.. ఏపీలో పరీక్షలు జరగవనే అనుమానాలు బలపడుతున్నాయి. సుప్రీంకోర్టు లేవనెత్తిన సందేహాలు, చేసిన వ్యాఖ్యలు చాలా సూటిగా, స్పష్టంగా ఉన్నాయి. పరీక్షలు పెడితే, దానివల్ల ఒక్కరు మరణించినా.. కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించింది సుప్రీంకోర్టు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..