నాకు ఆ డబ్బులొద్దు , పేదలకు అది చేయండి..

  0
  1825

  సోను సూద్ కరోనా కష్టకాలంలో ఒక ఆశాకిరణంమయ్యాడు. వ్యక్తిగతంగా ఒక సేవ మూర్తిగా ఉద్భవించిన మానవతా మూర్తిగా పేరుతెచ్చుకున్నారు.. కరోనా కాలంలో విదేశాల్లో చిక్కుకున్న యువతీ యువకులను ప్రత్యేక విమానాలద్వారా రప్పించారు. లాక్ డౌన్ సమయంలో తమ గ్రామాలకు పోలేక నిలిచిపోయిన పేదవారిని , అలాగే బ్రతుకు తెరువు లేకుండా అల్లాడిపోయిన పేదలను, తన సాయం కోసం వచ్చిన ఏ ఒక్కరిని కాదనకుండా ఆదుకున్న దయామయుడు.

  ఎవరెన్ని మాట్లాడినా , సోను సూద్ లాగా ,ఒక వ్యక్తిగా కష్టకాలంలో ప్రజలకు సాయం అందించిన ఏకైక వ్యక్తి ఆయన. అందుకే సోనూసూద్ని ఈరోజుకు ప్రతి ఒక్కరూ గొప్ప మానవతా మూర్తిగా కీర్తిస్తారు. ఇప్పుడు ఆయన అసమాన మానవ సేవకు మరో నిదర్శనం ఇది.. ఇటీవల దుబాయ్ పర్యటనలో ఆస్టర్ హాస్పిటల్స్ యాజమాన్యం సోనుసూద్ తో , ప్రమోషనల్ కాంట్రాక్ట్ కోసం సంప్రదించింది. అయితే సోను సూద్ 12 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

  ఈ 12 కోట్ల రూపాయలు డబ్బులు హాస్పిటల్ నుంచి ఆయన తీసుకోవడం లేదు . 12 కోట్ల రూపాయలకు సమమైన లివర్ మార్పిడి ఆపరేషన్ లు పేద ప్రజల కోసం ఉచితంగా చేసి పెట్టమని కోరాడు. ప్రమోషన్ కోసం డబ్బులు అవసరం లేదని ఆ డబ్బులు కి , తాను సూచించే వారికి ఉచితంగా లివర్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ చేయమని కోరాడు. దీని ప్రకారం 12 కోట్ల రూపాయలకు 50 మందికి లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్లు చేయవచ్చు . దీనికి సంబంధించి ఇప్పుడు హాస్పిటల్ యాజమాన్యం, సోనూసూద్ చర్చలు జరుగుతున్నాయి.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.