ఆ చిన్నారికి సోనూ ఆపన్నహస్తం..

  0
  331

  హైద‌రాబాద్ అపోలో ఆస్ప‌త్రిలో చిన్నారికి లివ‌ర్ ట్రాన్స్ ప్లాంట్ కోసం సాయం చేసి మ‌రోసారి త‌న మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. చికిత్స అనంతరం ఆ చిన్నారి కోటుకుంటోందంటూ, సంతోషాన్ని వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేశారు. అక్షర శ్రీ అనే చిన్నారి లివ‌ర్ స‌మ‌స్య‌తో బాధ ప‌డుతోంది. ఇప్ప‌టికే అపోలో ఆస్ప‌త్రిలో చేర్చించాం. సాయం చేయండి అంటూ వెంక‌టేశ్ పిళ్ళై అనే వ్య‌క్తి ట్విట్ట‌ర్ ద్వారా సోనూసూద్ ను కోరారు. వెంట‌నే స్పందించిన ఆయ‌న చిన్నారి స‌ర్జ‌రీ కోసం తన వంతు స‌హాయం అందించారు. లాక్ డౌన్ సమయంలో ఎంతోమ‌ది వ‌ల‌స కూలీల‌ను గమ్య స్థానాలకు చేర్చేందుకు బస్సులు, విమానాలను ఏర్పాటు చేసి.. సోనూసూద్ వారిని వారి సొంత గ్రామాలకు చేర్చిన సంగతి తెలిసిందే. అడిగిన వారికి లేద‌న‌కుండా సాయం చేస్తూ రియల్ హీరోగా అనిపించుకున్నారు.

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.