విందుభోజనం తింటున్న కొత్త అల్లుడు ఏమంటున్నాడంటే..?

    0
    1197

    భీమవరంలో కొత్త అల్లుడికి అత్తగారు 125 రకాలతో విందుభోజనం వడ్డించారు. సంక్రాంతి పండగ సందర్భంగా తొలిసారి అత్తగారింటికి వచ్చిన అల్లుడికి మర్యాదలన్నీ చూపించారు. ఈ సందర్భంగా పిండి వంటలతో భోజనం వడ్డించారు. విస్తరి ముందు కూర్చున్న అల్లుడు ఆ వంటకాలన్నీ చూసి షాకయ్యాడు. ఒకటీ, రెండూ.. అంటూ లెక్కపెడితే మొత్తం 125 రకాల వంటకాలు తేలాయి. ఇంతకీ ఆ అల్లుడు వంటకాలన్నిటినీ రుచి చూశాడా లేదా..?

    భోజనం చేయడానికి కూర్చున్న అల్లుడు వంటకాలను చూసి షాకయ్యాడు కానీ, వెంటనే తన భార్యను కూడా రుచి చూడమని అడిగాడు. అయితే అమ్మాయి సున్నితంగా తిరస్కరించింది, నా వల్లకాదని చెప్పేసింది. ఇక చేసేదేం లేక అల్లుడే అన్ని రకాల వంటకాలను రుచి చూశాడు.