మరికొద్ది గంటల్లో మొబైల్స్ సిగ్నల్స్ పై సోలార్ తుఫాన్..

  0
  796

  ప్ర‌పంచంలో శాస్త్ర‌వేత్త‌లు ఆస‌క్తిక‌రంగా ఉన్న సౌర‌తుఫాన్ మ‌రో 24 గంట‌ల్లో భూమి అయస్కాంత క్షేత్రంలోకి ప్ర‌వేశించ‌నుంది. ఇది గంట‌కు 16 ల‌క్ష‌ల కి.మీ వేగంతో వ‌స్తోంది. నాసా అంచ‌నాల ప్ర‌కారం ఇది భూఅయ‌స్కాంత క్షేత్రాన్ని మంగ‌ళ‌వారంలోగా తాకితే, భూమి మీద విద్యుత్ ప్ర‌సారాలు, క‌మ్యూనికేష‌న్లు, శాటిలైట్ సేవలు చాలావ‌ర‌కు స్థంభించిపోతాయి. సూర్య వాతావ‌ర‌ణం నుంచి ఈ సౌర‌తుఫాను భూమి వైపు వ‌స్తున్న‌ట్లు జులై 3వ తేదీన‌ గుర్తించారు. మొద‌ట సెక‌నుకు 500 కి.మీ వేగంతో ప్రారంభ‌మైన ఈ సౌర‌తుఫాన్ వేగం పుంజుకుంది. ఇది భూమి మీద కంటే భూ ఉప‌రిత‌ల వాతావ‌ర‌ణంలో ఎక్కువ ప్ర‌భావం చూపిస్తుంది. చాలావ‌ర‌కు ఉప గ్ర‌హాలు దెబ్బ తింటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. జీపీఎస్ నావిగేష‌న్ సిస్ట‌మ్, శాటిలైట్ టీవీలు, ప‌వ‌ర్ గ్రిడ్స్, సెల్ ఫోన్లు దీని వ‌ల్ల ప‌త‌న‌మ‌య్యే అవ‌కాశ‌ముంది. దీనివ‌ల్ల హైఫ్రీక్వెన్సీ రేడియో త‌రంగాల‌కు కూడా తీవ్ర‌మైన విఘాతం క‌లుగుతుంది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.