వాటర్ ట్యాప్ కి, సబ్బు బిళ్లకి లంకె ఎలా కుదిరిందంటే..?

    0
    296

    పోస్టాఫీసుల్లో, బ్యాంకుల్లో బెంచీలకు పెన్నుని దారంతో కట్టేయడం చూసి ఉంటాం. ఎవరు పడితే వాళ్లు పెన్ను తీసుకెళ్లకుండా బ్యాంక వాళ్లు చేసుకునే ఏర్పాటు అది. అయితే అతి తెలివి ఉన్నవాళ్లు.. అలా పెన్ను కట్టేసినా దాన్ని తీసుకెళ్తంటారు, అసలు దారం కూడా లేకుండా చేసేస్తుంటారు. పెన్ను, దానితోపాటు దారం కూడా ఉండదని తెలిసినా కూడా పెన్నుకి దారం కట్టే అలవాటుని మానుకోరు బ్యాంకు వాళ్లు. ఇదిగో అలాంటి పిచ్చి పనే ఇది కూడా. వాస్తవానికి ఇది అంతకంటే పిచ్చి పని. సబ్బుతో చేతులు కడుక్కుని ఆ సబ్బుని జేబులు పెట్టుకెళ్లాలని ఎవరనుకుంటారు. పోనీ ఎవరైనా అనుకుంటే, దాన్ని అడ్డుకునేదెవరు. ఇదిగో ఇలా సబ్బుకి రంధ్రం చేసి, దాన్ని దారంతో ట్యాప్ కి కట్టేసినంత మాత్రాన కక్కుర్తిగాళ్లను ఆపేదెవరు..? సోషల్ మీడియాలో ఇలాంటి డిఫరెంట్ ఐడియాలతో వచ్చిన పోస్టింగ్ లు తెగ వైరల్ అవుతంటాయి. ఇది కూడా అలాగే వైరల్ అయింది.

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..