నాగుపాము నోటిని ఫెవి క్విక్ తో మూసేసారు..

    0
    111

    నాగుపాముని నాగ‌దేవ‌త కొలిచే సంప్ర‌దాయం మ‌న‌ది. నాగుల చ‌వితి, నాగ‌పంచ‌మి, నాగ‌పూర్ణిమ ఇలా నాగ‌దేవ‌త‌ను ఆరాధిస్తూ పండుగ‌లు కూడా జ‌రుపుకుంటుంటాం. పుట్ట‌లో పాలు పోసి కోరిక‌లు కోరుకుంటాం. ఆ కోరిక‌లు నెర‌వేరిన త‌ర్వాత మొక్కులు కూడా చెల్లించుకుంటాం. అయితే ఒరిస్సాలోని భువనేశ్వ‌ర‌లో మాత్రం కొంత‌మంది మూఢ‌భ‌క్తితో నాగుపామును పూజ కోసం హింసించారు. పూజ పేరుతో ఆ పాము నోటికి ఫెవి క్విక్ వేసి అతికించారు. పాము నోరు తెర‌వ‌కుండా, కాటు వేయ‌కుండా ఉండేందుకు ఈ దారుణానికి పాల్ప‌డ్డారు. అలా హింసిస్తూ ఆ పాముకి పూజ‌లు చేశారు.

    ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో వ‌న్య‌ప్రాణి సంర‌క్ష‌కుల దృష్టికి వెళ్ల‌డంతో అక్క‌డికి చేరుకున్నారు. ఆ పాముని ప‌ట్టుకుని నోటికి అంటుకుపోయిన గ‌మ్ ను తొల‌గించారు. గోరు వెచ్చ‌ని నీటిలో నిమ్మ‌ర‌సం పించి, పాము త‌ల‌ను ఆ నిమ్మ‌ర‌సంలో కాసేపు ముంచారు. ఆ త‌ర్వాత దాని త‌ల‌ను బ‌య‌ట‌కి తీసి… ఇయ‌ర్ బ‌డ్స్ తో పాము నోటిపై రుద్దుతూ గ‌మ్ ను తొల‌గించారు. దీంతో పాము నోరు య‌ధాస్థానంలోకి వ‌చ్చింది. వెంట‌నే ఆ పామును స‌మీపంలోని అడ‌విలో వ‌దిలేశారు. ఈ అమానుషానికి పాల్ప‌డిన వారిపై కేసులు న‌మోదు చేయించారు.

    ఇవీ చదవండి..

    ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

    బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

    ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

    శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..