పున్నమినాగుని అన్నాడు.. చివరికి..

    0
    17821

    వీడెవడో పున్నమినాగులో చిరంజీవి లాంటివాడినని అనుకొని ఉంటాడు . పాములు పట్టడంలో మాత్రం ఆరితేరినవాడనే పేరుంది. పేరు బెర్నార్డో. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన అన్నిరకాల పాముల్ని పట్టాడు. తనని పాము ఎన్నిసార్లు కాటేసినా తకేమీ కాదని, తన శరీరం కూడా విషపూరితం అని చెబుతుండేవాడు. ఇతడి గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా వార్తలు రావడంతో కొంతమంది పరిశోధకులు ఇతని వద్దకు వచ్చారు. ఆ బృందంలో డాక్టర్లు కూడా ఉన్నారు.

    తన ప్రతిభను చూపించేందుకు మంగళ్ దాన్ అనే ప్రాంతంలో పాములు పట్టేందుకు సిద్ధమయ్యాడు. అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను పట్టుకుని నాలుకతో ఆడించాడు. అలాగే నోట్లో పెట్టుకున్నాడు. అకస్మాత్తుగా అది నాలుకపై కాటేసింది. అంతే క్షణాల్లో చనిపోయాడు. అక్కడే ఉన్న డాక్టర్లు, పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. అప్పటి వరకు అతడిని ఏ పాము కూడా ఏమీ చేయలేదని, అతని శరీరం కూడా విషపూరితమేనన్న స్థానికులు వెంటనే ఆ పాముని పట్టుకుని చంపేశారు.

    ఫిలిప్పీన్స్ లోని మంగళ్ దాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తనని తాను స్నేక్ మ్యాన్ గా చెప్పుకునే బెర్నార్డో.. చివరికి ఆ పాము చేతిలోనే ప్రాణం వదలాల్సి వచ్చింది.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.