సర్పాల సయ్యాట… చూడడానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. సృష్టిలో సర్పాలు పెనవేసుకున్నంత గాఢంగా పెనవేసుకునే మరో ప్రాణి లేదు. అంత బలంగా, గాఢంగా పెనవేసుకుంటాయి. ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి నాట్యమాడుతుంటాయి.
పొలాల్లో, మైదానాల్లో, చెట్ల పొదల మాటున పాములు ఇలా పెనవేసుకుని సగం ఎత్తుకు పైకి లేచి కింద పడుతూ సయ్యాటలాడిన దృశ్యాలు చాలామందే చూసి ఉంటారు. కానీ ఈ పాముల సయ్యాట మాత్రం కాస్త ప్రత్యేకమనే చెప్పాలి.
ఎందుకంటే… ఈ పాముల జంట ఒకదానినొకటి.. తల వరకు పెనవేసుకుని ఉండటమే. పడగ వరకు ఒకదానితో అల్లుకుపోతున్నాయి. ఒకటి పోటీ పడుతూ తన్మయత్వంలో మునిగి తేలుతున్నాయి. నాగాలాండ్‌లో సర్పాల అరుదైన సయ్యాటను ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ తన ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.
Courtship in #Snakes recorded a friend 💐💐 @ParveenKaswan @susantananda3 pic.twitter.com/CsZPf3zlhT
— Rupin Sharma (@rupin1992) June 4, 2022