స్మగ్లర్లకు ప్లాస్టిక్ కవర్లు తగిలించారు..

  0
  68

  కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి స్మగ్లింగ్ కేసులో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. స్మగ్లర్లను మీడియాకి చూపించారు. వాళ్ళ ముఖాలు కనిపించకుండా నల్లగుడ్డనో , లేదా ఏదైనా గుడ్డనో వెయ్యాలి. నిందితులు కాబట్టి వాళ్ళ ముఖాలు చూపించకూడదని చట్టం చెబుతుంది. ఇంతవరకు బాగానేవుంది ..అయితే పోలీసువద్ద ముసుగుల్లేక , స్మగ్లర్లకు పారేసిన డిస్పోసబుల్ ప్లాస్టిక్ కవర్లు తగిలించారు.. ఇదే హైలైట్. విశాఖ జిల్లా చింతపల్లి మండలం నుంచి గంజాయి స్మగ్లింగ్ చేసి కడప లో విక్రయిస్తున్న ఈ గంజాయి ముఠా నుంచి 120 కేజీల గంజాయి, ఒక టాటా బోల్ట్ కారు, 7వేల రూపాయలు నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.