పెళ్ళి వయసుకి ఎదిగిన పిల్లలతో తల్లి తాను పెళ్లిచేసుకుంటానంటే ఎలా ఫీలవుతారో ..? సింగర్ సునీత ఏమి చెప్పిందో వినండి. చాలా రోజుల అంతర్మధనం తరువాత సునీత, రామ్ పోతినేనిని పెళ్లాడాలని నిర్ణయానికి వచ్చింది. తన నిర్ణయం ఏదైనా బిడ్డల భవిష్యత్తుపై ప్రభావం చూపకూడదని భావించింది. ఒక రోజు తన నిర్ణయాన్ని పిల్లలకు చెప్పింది. వాళ్ళు ఏమిచెప్తారోనన్న భయంకూడా ఉండింది. అయితే సునీత ఈ విషయాన్నీ వాళ్ళతో చెప్పినప్పుడు , బిడ్డలిద్దరూ తల్లిని వాటేసుకొని తమ అంగీకారాన్ని ఆనందం రూపంలో ఇలా తెలియజేసారని సునీత చెప్పింది. తన తల్లి తండ్రులు చాలాకాలంగా తనను , పెళ్లిచేసుకోమని కోరుతున్నా , బిడ్డల కోసమే ఆలోచిస్తూ తాను వాయిదా వేసేదాన్నని చెప్పింది. పెళ్ళికిముందు పరిచయంలో రామ్ పోతినేని తన సోషల్ మీడియా అకౌంట్ చూడేవాడని చెప్పింది..