ఏడాదిలో 25 మందితో ఆమె డేటింగ్ డైరీ ..

  0
  926

  ఓ మ‌హిళ త‌న ఆత్మ‌క‌ధ రాయ‌బోతోంది. ఆ ఆత్మ‌క‌ధ ఎందుకో.. దేనికో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు. ఇలాంటి ఆత్మ‌క‌ధ‌లు కూడా వుంటాయా అని నోరెళ్ళ‌బెడ‌తారు. ఒక్క ఏడాదిలో డేటింగ్ యాప్ లో ఫేక్ ఫోటోలు, ఫేక్ ప్రొఫైల్స్ పెట్టి త‌న‌ను మోసం చేసిన 25 మంది మ‌గాళ్ళ గురించి ఆమె ఆత్మ‌క‌ధ రాస్తోంది.

   

   

  ఏడాదిలో 25 మందితో త‌న జీవితాన్ని పంచుకుని ఎంతో అనుభ‌వాన్ని సంపాదించి రెండేళ్ళ క్రితం డేటింగ్ చేసి వ‌దిలేసిన ఓ వ్య‌క్తిని మ‌ళ్ళీ ఇప్పుడు కోరి పెళ్ళి చేసుకుంది. 42 ఏళ్ళ‌ స‌మంత త్రోన్ అనే వివాహిత‌కు ఇద్ద‌రు బిడ్డ‌లు. భ‌ర్త‌కు విడాకులు ఇచ్చి తోడు కావాల‌నుకుని డేటింగ్ యాప్ లో మ‌గాళ్ళ కోసం అన్వేషించింది. స‌గ‌టున 15 రోజుల‌కు ఒక మ‌గాడితో త‌న జీవితాన్ని పంచుకుంటూ దాదాపు 25 మందితో డేటింగ్ చేసి వారంద‌రూ మోస‌గాళ్ళే అని నిర్ధారించుకుంది.

   

   

  ఇంత‌మందితో డేటింగ్ చేసిన త‌న అనుభ‌వాల‌ను డేటింగ్ చేసే అమ్మాయిల కోసం ఒక పుస్త‌కంగా రాస్తున్న‌ట్లు చెప్పింది. ఒక‌సారి డేటింగ్ చేసి వ‌దిలేసిన మ‌గాళ్ళు, ఫేక్ ప్రొఫైల్ సృష్టించి మ‌ళ్ళీ మ‌ళ్ళీ డేటింగ్ పిలుస్తుంటార‌ని, ఆ వివ‌రాల‌న్నీ పూస‌గుచ్చిరాస్తానంటోంది. చివ‌ర‌కు త‌న‌తో డేటింగ్ చేసి విడిపోయిన 55 ఏళ్ళ డేవిడ్ టైస‌న్ ను ఫైన‌ల్ చేసుకుంది. ఇప్పుడు డేటింగ్ డైరీ పేరుతో త‌న ఆత్మ‌క‌ధ రాస్తోంది. ఈ ఆత్మ‌క‌ధ‌లో తాను 25 మందితో పంచుకున్న అనుభ‌వాలు, అనుభూతుల‌ను వివ‌రిస్తానంటోంది.

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.