ఇతడు ఆక్సిజన్ మ్యాన్ ఆఫ్ బాంబే.. ఎందుకు..?

  0
  464

  దేశాన్ని క‌కావిక‌లం చేస్తోన్న మ‌హావిల‌యం క‌రోనా. క‌రోనా రోగుల కోసం ఆక్సీజ‌న్ సిలిండ‌ర్ల‌ను ఉచితంగా అందించేందుకు ఓ వ్య‌క్తి త‌న ఆస్తిని అమ్ముకున్నాడు. క‌రోనా సాకుతో పేద‌ల నుంచి ల‌క్ష‌ల రూపాయ‌లు గుంజే కార్పోరేట్ ఆస్ప‌త్రులు.. ఆ వ్య‌క్తి దాతృత్వం చూస్తే సిగ్గుతో త‌ల‌దించుకోవాలి. రోగుల‌కు ప్రాణాధార‌మైన ఆక్సీజ‌న్ ను బ్లాక్ లో అమ్మే వ్యాపారులు… ఈ యువ‌కుడిని చూస్తే మాన‌వుడిగా పుట్టినందుకు సిగ్గుప‌డాలి. ఇత‌ని పేరు షాన్వాజ్ షేక్. ముంబైలోని మ‌లాడ్ ప్రాంత వాసి. ఇప్పుడు అత‌నిని ఆక్సీజ‌న్ మ్యాన్ అని పిలుస్తున్నారు.

  ఇంట్లో ఉంటూ ఆక్సీజ‌న్ మీద ఆధార‌ప‌డే రోగులు ఎవ‌రైనా ఫోన్ చేస్తే వెంట‌నే ఆక్సీజ‌న్ ను తీసుకెళ్తాడు. ఇందుకోసం ఆక్సీజ‌న్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టాడు. త‌న జీవ‌నాధార‌మైన ఫోర్డ్ కారుని కూడా 22 ల‌క్ష‌ల‌కు అమ్మేశాడు. 160 ఆక్సీజ‌న్ సిలిండ‌ర్ల‌ను కొని అవ‌స‌ర‌మైన రోగుల‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్నాడు. త‌న ద‌గ్గ‌ర డ‌బ్బు అయిపోవ‌డంతో కారు కూడా అమ్మేసాన‌ని చెప్పాడు.

  గ‌తేడాది త‌న స్నేహితుడి భార్య ఒక ఆటో రిక్షా ప్ర‌మాదంలో గాయ‌ప‌డి ఆస్ప‌త్రిలో ఆక్సీజ‌న్ దొర‌క‌క చ‌నిపోయింద‌ని చెప్పాడు. అప్ప‌టి నుంచి రోగుల‌కు ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రా చేయాల‌ని నిర్ణ‌యించుకుని, ఈ ప‌ని చేస్తున్న‌ట్లు తెలిపాడు. ప్ర‌స్తుతం 500 నుంచి 600 మంది ప్ర‌తి రోజూ ఫోన్ చేస్తుంటార‌ని చెప్పాడు. త‌న బృందంలోని స‌భ్యులు రేయింబ‌వ‌ళ్ళు ఆక్సీజ‌న్ అందించేందుకు ప‌ని చేస్తుంటార‌ని చెప్పాడు. ఇప్ప‌టివ‌ర‌కు 4000 మంది పేషంట్ల‌కు ఆక్సీజ‌న్ స‌ప్ల‌య్ చేశాన‌ని తెలిపాడు. పేద‌వాళ్ళ‌కు ఖ‌చ్చితంగా ఉచితంగానే ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని చెప్పాడు.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.